Homeక్రైమ్బంగారం షాపులో భారీ చోరి...! 2కోట్ల వ‌జ్రాలు అప‌హ‌ర‌ణ‌...

బంగారం షాపులో భారీ చోరి…! 2కోట్ల వ‌జ్రాలు అప‌హ‌ర‌ణ‌…

మేడ్చ‌ల్‌, క్రైమ్‌మిర్రర్‌: మేడ్చ‌ల్ జిల్లాలోని మేడిప‌ల్లిలో ఓ బంగారం షాపులో భారీ చోరి చోటు చేసుకుంది. అర్థారా్ర‌తి షెట్ట‌ర్ తొల‌గించి షాపులోకి ప్ర‌వేశించిన దుండ‌గులు రూ.2కోటు్ల విలువ‌గ‌ల వ‌జ్రాలు దోచుకెళ్లిన‌ట్లు షాపు సిబ్బంది పేర్కొన్నారు. డైమండ్స్‌తో పాటు బంగారు ఆభ‌ర‌ణాలు కూడ చోరికి గురైన‌టు్ల మేనేజ‌ర్ మేనేజ‌ర్ సుబ్ర‌హ్మ‌ణ్యం తెలిపారు. వరంగల్ జాతీయ రహదారి మేడిపల్లి మెయిన్ రోడ్డులోని గోల్డ్ షాప్‌లో ఈ సంఘటన జరిగింది. ఈరోజు(సోమవారం) ఉదయం షాప్‌కు వచ్చిన సిబ్బంది చోరీ జరిగినట్లు గుర్తించారు.

వెంటనే పోలీసులకు సిబ్బంది సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న మేడిపల్లి పోలీసులు, క్లూస్ టీమ్ ఆధారాలు సేకరించే పనిలో ఉన్నారు. షాపులోని సీసీ కెమెరా ఫుటేజీని పోలీసులు పరిశీలిస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు.. నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. దాదాపు ఏడు మంది దొంగలు చోరీ చేసినట్టు అనుమానిస్తున్నారు.

ఇవి కూడ చ‌దవండి:

 

  1. అమెరికాలో ఘోర రోడ్డు ప్రమాదం.. తెలంగాణ యువతి దుర్మరణం
  2.  ప్రేమ వ్యవహారం విషాదాంతం.. యువతిపై దాడి చేసి యువకుడి ఆత్మహత్య
  3.  మైనర్ బాలికపై అఘాయిత్యం.. 45 ఏళ్ల వ్యక్తిపై కేసు
  4.  అనంతపురంలో అమానవీయ ఘటన.. కంపచెట్టుపై అప్పుడే పుట్టిన శిశువు

 

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు