Homeఆంధ్ర ప్రదేశ్ఘోర రోడ్డు ప్ర‌మాదం...! భార్య‌భ‌ర్త‌లు స్పాట్‌లోనే...

ఘోర రోడ్డు ప్ర‌మాదం…! భార్య‌భ‌ర్త‌లు స్పాట్‌లోనే…

అన‌కాప‌ల్లి, క్రైమ్‌మిర్ర‌ర్‌: అన‌కాప‌ల్లి జిల్లాలో సోమ‌వారం తెల్ల‌వారు జామున జ‌రిగిన ఘోర రోడ్డు ప్ర‌మాదంలో భార్య‌భ‌ర్త‌ల మృతిచెందారు. ఒక్క‌సారిగా ఆప్రాంతంలో క‌ల‌క‌లం రేగింది. జిల్లాలోని ఎలిమంచిలి మండ‌లం పుల‌ప‌ర్తి జంక్ష‌న్ స‌మీపంలో జాతీయ ర‌హ‌దారి పై సైకిల్‌పై వెళ్తున్న భార్య‌భ‌ర్త‌ల‌ను గుర్తు తెలియ‌ని వాహ‌నం ఢీకొట్ట‌డంతో ప్ర‌మాదంలో వారిద్ద‌రు అక్క‌డిక‌క్క‌డే మృతి చెందారు. గ‌మ‌నించిన వాహ‌నాదారులు వెంట‌నే పోలీసుల‌కు స‌మాచారం అంద‌జేయ‌డంతో పోలీసులు ఘ‌ట‌న స్థ‌లానికి చేరుకుఒని మృత‌దేహాల‌ను స‌వ్ధీనం చేసుకొని పోస్టుమార్టం నిమిత్తం అన‌కాప‌ల్లి ప్ర‌భుత్వ ఆసుప‌త్రికి త‌ర‌లించారు.

ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మృతి చెందిన భార్యాభర్తలు పులపర్తి గ్రామానికి చెందిన పాపారావు, అమ్మాజీలని పోలీసులకు స్థానికులు తెలిపారు. ఈ రోజు తెల్లవారుజామున పాలు తీసేందుకు పొలం వద్దకు వెళ్తుండగా వారిని వాహనం ఢీ కొట్టిందని వివరించారు. ఈ ప్రమాద స్థలానికి సమీపంలోని సీసీటీవీ కెమెరా ఫుటేజీను పోలీసులు పరిశీలిస్తున్నారు. కాగా రోడ్డు మృతి చెంద‌డంతో ఆ ప్రాంతంలో తీవ్ర విషాదం నెల‌కొంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు