Homeఆంధ్ర ప్రదేశ్అమరావతికి మరో రైల్వే లైన్...!

అమరావతికి మరో రైల్వే లైన్…!

  • ఎర్రుపాలెం – నంబూరు రైల్వే లైన్ నాలుగో ప్యాకేజీ పనులకు గ్రీన్ సిగ్నల్

  • రూ.599 కోట్లతో టెండర్లకు ఆహ్వానం

  • రెండున్నర సంవత్సరాలలో పూర్తి చేయాలని లక్ష్యం

క్రైమ్ మిర్రర్, ఏపీ బ్యూరో: కూటమి ప్రభుత్వం అమరావతిపై ప్రత్యేకంగా ఫోకస్ పెట్టింది. తొలి విడత రాజధాని నిర్మాణాన్ని 2028 నాటికి పూర్తి చేయాలన్న కృతనిశ్చయంతో ఉంది. అదే సమయంలో కేంద్ర ప్రభుత్వం నుంచి సంపూర్ణ సహకారం అందుతుంది. రోడ్డు, రైలు ప్రాజెక్టులు భారీగా మంజూరు అవుతున్నాయి. అందులో భాగంగా అమరావతి మీదుగా మరో రైల్వే లైన్ నిర్మాణానికి టెండర్లు పిలవడం ప్రాధాన్యత సంతరించుకుంది. అమరావతి మీదుగా ఎర్రుపాలెం- నంబూరు రైల్వే లైన్ లో నిర్మించనున్న నాలుగో ప్యాకేజీకి రైల్వే శాఖ టెండర్లు పిలిచింది. కృష్ణా నది దాటిన తర్వాత వడ్డమాను వరకు ఎప్పటికీ మూడు ప్యాకేజీలకు రైల్వే శాఖ టెండర్లు పిలిచింది. ఇప్పుడు చివరిదైన ఎర్రుపాలెం – నంబూరు రైల్వే లైన్ నాలుగో ప్యాకేజీ కూడా మోక్షం లభించింది.

ఎనలేని ప్రాధాన్యం…

అమరావతి రాజధానికి కేంద్ర ప్రభుత్వం ఎనలేని ప్రాధాన్యం ఇస్తోంది. ముఖ్యంగా రోడ్డు, రైల్వే ప్రాజెక్టుల్లో అగ్ర తాంబూలం దక్కుతోంది. తాజా రైల్వే లైనుకు సంబంధించి.. వడ్డమాను నుంచి నంబూరు వరకు 28.35 కిలోమీటర్ల మేర రైల్వే లైన్ నిర్మాణానికి రూ.599.33 కోట్ల అంచనా వ్యయంతో టెండర్లను పిలిచారు. నవంబర్ 23 వరకు బిడ్ల దాఖలుకు గడువు కూడా ఇచ్చారు. పీపీపీ విధానంలో నిర్మించే ఈ నిర్మాణాన్ని రెండున్నర సంవత్సరాలలో పూర్తి చేయాల్సి ఉంటుందని దక్షిణ కోస్తా రైల్వే జోన్ అధికారులు చెబుతున్నారు.

నాలుగు ప్యాకేజీలుగా…

వాస్తవానికి ఎర్రుపాలెం- అమరావతి- నంబూరు రైల్వే లైన్ ప్రాజెక్టుల మొత్తం 58.10 కిలోమీటర్లు కాగా.. దీనిని నాలుగు ప్యాకేజీలుగా నిర్మించనున్నారు. ఖమ్మం జిల్లా పరిధిలోని ఎర్రుపాలెం నుంచి పెద్దాపురం సమీపం వరకు తెలంగాణ పరిధిలో 3.5 కిలోమీటర్లు మొదటి ప్యాకేజీగా ఉంది. పెద్దాపురం నుంచి కృష్ణ నది వంతెన వరకు ఎన్టీఆర్ జిల్లాలో రెండో ప్యాకేజీ.. కృష్ణా నదిపై 3.23 కిలోమీటర్ల మేర వంతెనతో పాటు పల్నాడు జిల్లా వడ్డమాను వరకు మూడో ప్యాకేజీ కింద ఉంది. తాజాగా వడ్డమాను నుంచి నంబూరు వరకు 28.35 కిలోమీటర్లు నాలుగో ప్యాకేజీకి తాజాగా టెండర్లు ఆహ్వానించారు.

9 చోట్ల స్టేషన్లు…

ఈ నాలుగో ప్యాకేజీల పరిధిలో ఎర్రుపాలెం – అమరావతి- నంబూరు లైన్ లో 9 చోట్ల రైల్వే స్టేషన్లను నిర్మించనున్నారు. పెద్దాపురం, చెన్నారావు పాలెం, గొట్టుముక్కల, పరిటాల, కొత్తపేట, వడ్డమాను, అమరావతి, తాడికొండ, కొప్పరావులలో స్టేషన్లను నిర్మించనున్నారు. 2004లోనే ఈ ప్రాజెక్టు మంజూరు అయింది. వీలైనంత త్వరగా పూర్తి చేసేందుకు రైల్వే శాఖ కృషి చేస్తోంది.

 

ఇవి కూడ చ‌ద‌వండి:

 

  1. పుణే హత్య కేసులో సంచలన విషయాలు.. మర్డర్ ప్లాన్ కోసం ChatGPT సాయం తీసుకున్న సియా గోయల్ 
  2. సీఈసీ జ్ఞానేశ్ కుమార్‌పై విజిలెన్స్ విచారణ.. 2006 నాటి కేసులో కీలక పరిణామం
  3. టీవీకే కీలక నిర్ణయం.. ఇండియా కూటమిలో విజయ్ పార్టీ చేరిక
  4.  అమెరికాలో ఘోర రోడ్డు ప్రమాదం.. తెలంగాణ యువతి దుర్మరణం

 

 

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు