Homeఆంధ్ర ప్రదేశ్క‌రువులో ఉన్న నేల ఇప్ప‌డు అభివృద్ది వైపు...! డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ళ్యాణ్‌...

క‌రువులో ఉన్న నేల ఇప్ప‌డు అభివృద్ది వైపు…! డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ళ్యాణ్‌…

అన్న‌మ‌య్య‌, క్రైమ్‌మిర్ర‌ర్‌: రాయ‌ల‌సీమ ఒక‌ప్పుడు క‌రువుతో ఉన్న నేల ఇప్పుడు అభివృద్ది వైపు ప‌య‌నిస్తుంద‌ని డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ళ్యాణ్ అన్నారు. శుక్ర‌వారం జిల్లాలోని రాయ‌ల‌సీమ హార్టిక‌ల్చ‌ర్ హ‌బ్‌కు శంకు స్థాప‌న చేశారు. ఈ కార్య‌క్ర‌మానికి సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్‌, కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్‌, మంత్రి లోకేశ్, అనంత్ అంబానీ పాల్గొన్నారు.ఈ సంద‌ర్భంగా అక్క‌డే ఏర్పాటు స‌భ‌లో డిప్యూటీ సీఎం మాట్లాడుతూ రూ.లక్ష కోట్ల పెట్టుబడితో రాయలసీమ ఉద్యాన హబ్‌‌ను ఏర్పాటు చేయబోతున్నట్లు చెప్పారు.

రాయలసీమను నీటి సంరక్షణ రీజియన్‌గా తీర్చిదిద్దుతామని వెల్లడించారు. రాయలసీమలో భూగర్భ జలమట్టాలు సగటున 3.6 మీటర్లు పెరిగాయన్నారు. రాయలసీమలో ఉద్యాన సాగుకు కొత్త అవకాశాలు ఏర్పడుతున్నాయని తెలిపారు. ఇప్పటికే పల్లెపండుగ కార్యక్రమం ద్వారా రాయలసీమలో గత రెండేళ్లలో రూ.8వేల కోట్లకుపైగా అభివృద్ధి పనులను చేపట్టినట్లు పవన్ కల్యాణ్ పేర్కొన్నారు. 10 జిల్లాలు, 201 క్లస్టర్లలో ఉద్యాన అభివృద్ధి చేయనుంది. రాయలసీమ హార్టికల్చర్ హబ్‌కు ప్రభుత్వం నుంచి రూ.40,352 కోట్ల పెట్టుబడి పెట్టనుండగా.. ప్రైవేట్‌ రంగం నుంచి రూ.60 వేల కోట్ల పెట్టుబడులు పెట్టనున్నారు.

 

ఇవి కూడ చ‌ద‌వండి:
  1. అంబులెన్స్ ఆటో ఢీ…! తెలంగాణ మ‌హిళ మృతి…
  2.  బాలిక‌పై అత్యాచారం…! ఫోక్సో కేసు న‌మోదు…
  3.  ఏనుగు దంతాల ముఠా అరెస్టు…! 17కిలోల ఏనుగు దంతాలు స్వాధీనం…
  4. కొకాపేటలోవ‌డ్డీ వ్యాపారి దారుణ హత్య…!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు