ఒడిశా నుంచి మహారాష్ట్రకు అక్రమంగా తరలిస్తున్న భారీ మొత్తంలో గంజాయిని కొత్తగూడెం DTF, ఎక్సైజ్ అధికారులు సంయుక్తంగా పట్టుకున్నారు. మొత్తం 365.2 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్న అధికారులు.. నలుగురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు.
అధికారుల వివరాల ప్రకారం.. నిందితులు గంజాయిని వేర్వేరు వాహనాల్లో తరలిస్తున్నట్లు గుర్తించారు. ఈ క్రమంలో బైక్పై తరలిస్తున్న 9 కిలోల గంజాయిని, హ్యుందాయ్ కారులో ఉన్న 100 కిలోల గంజాయిని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. అలాగే కరుణగిరి సమీపంలో లారీలో తరలిస్తున్న మరో 263.2 కిలోల గంజాయి పట్టుబడింది.
ఈ కేసులో ఒడిశాకు చెందిన దివాకర్ మండల్ (22), సుమన్ పాల్ (22), రాజశేఖర్ మార్గి (22), బ్రిజన్ నాసా (20)లను అధికారులు అదుపులోకి తీసుకున్నారు. గంజాయి రవాణాకు ఉపయోగించిన బైక్, హ్యుందాయ్ కారు, లారీని సీజ్ చేశారు.
మొత్తంగా మూడు వాహనాల నుంచి 365.2 కిలోల గంజాయి స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు తెలిపారు. గంజాయి ఎక్కడి నుంచి తీసుకొచ్చారు, ఎవరికి తరలిస్తున్నారు అనే అంశాలపై తదుపరి దర్యాప్తు కొనసాగుతోంది.
also read: మీరట్ బ్లూ డ్రమ్ హత్య కేసులో కీలక తీర్పు.. భార్య, ప్రియుడుని దోషులుగా తేల్చిన కోర్టు
