Homeఆంధ్ర ప్రదేశ్పేద‌ల అభివృద్దే నా బాధ్య‌త‌...! సీఎం చంద్ర‌బాబు...

పేద‌ల అభివృద్దే నా బాధ్య‌త‌…! సీఎం చంద్ర‌బాబు…

అమ‌రావ‌తి, క్రైమ్‌మిర్ర‌ర్‌: పేద‌ల అభివృద్ది కోసం కూట‌మి ప్ర‌భుత్వం ప‌ని చేస్తోంద‌ని ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు అన్నారు. ఈ సంద‌ర్భంగా కూట‌మి ప్ర‌భుత్వం వ‌చ్చాక 28వ సారి పేద‌ల‌కు గురువారం పెన్ష‌న్లు పంపిణీ చేశారు.ఈ సంద‌ర్భ‌భంగా అక్క‌డే ఏర్పాటు చేసిన స‌భ‌లో .. ‘నేను కూడా బటన్ నొక్కొచ్చు.. కానీ సీఎం అంటే ప్రజల మధ్య ఉండాలని వచ్చాను’ అని తెలిపారు. తన దృష్టిలో సీఎం అంటే కామన్ మ్యాన్ అని అన్నారు. ప్రభుత్వ విధానాలను మార్చి పేదలకు సేవ చేయటమే తన బాధ్యతగా అని పేర్కొన్నారు.. ప్రతి నెలా నాలుగుసార్లు ప్రజల వద్దకు వస్తున్నట్లు తెలిపారు.

ప్ర‌జ‌ల‌కు ఇబ్బంది క‌లుగ‌కుండా భూస‌మ‌స్య‌ల‌ను ప‌రిష్క‌రిస్తున్న‌ట్లు ఆయ‌న పేర్కొన్నారు. కూటమి గ్రాఫ్ పెరుగుతోందని.. ప్రతిపక్షం గ్రాఫ్ పడిపోతుందని సర్వేలు చెబుతున్నాయని అన్నారు.. ఇప్పుడిప్పుడే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతోందని చెప్పారు. ఏపీ ఆర్థిక పరిస్థితి వెంటిలేటర్‌పై ఉన్న సమయంలో ప్రజలు వేసిన ఓటు వేసి కూటమిని గెలిపించారన్నారు. ఇప్పటికి రూ.76 వేల కోట్లు పింఛన్ల ద్వారా ప్రజలకు అందజేశామని వివరించారు. వృద్ధులు, దివ్యాంగులు, వితంతువులు ఇబ్బంది పడకుండా చర్యలు తీసుకున్నామని సీఎం పేర్కొన్నారు.

ఇవి కూడ చ‌ద‌వండి:

 

  1. రాయ‌ల‌సీమ‌కు భారీ ప్రోత్సాహం…! మంత్రి అచ్చెన్నాయుడు…
  2. ఎల్‌బీ నగర్ సర్కిల్‌లో సీజ్ బోర్డుల వెనుక సీక్రెట్ ఏంటి…?
  3. రష్యా సైన్యంలో మనవారు…!
  4. షుగర్, బీపీ అదుపులో ఉండాలంటే ఆరోగ్య నిపుణులు చెబుతున్న ముఖ్యమైన చిట్కాలు!

 

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు