Homeక్రైమ్నిమ్స్ లో అవినీతి డాక్టర్...! ఆదాయానికి మించిన ఆస్తులు...

నిమ్స్ లో అవినీతి డాక్టర్…! ఆదాయానికి మించిన ఆస్తులు…

  • ఏక కాలంలో 13 ప్రాంతాల్లో త‌నిఖీలు…

 

క్రైమ్ మిర్రర్, తెలంగాణ బ్యూరో: తెలంగాణలో ఏసీబీ అధికారులు మరింత దూకుడు పెంచారు. ఈసారి వైద్య ఆరోగ్యశాఖ పై దృష్టిపెట్టారు. అందులో భాగంగా హైదరాబాద్ నిమ్స్ అడిషనల్ సూపరిండెంట్ డాక్టర్ లక్ష్మీ భాస్కర్ ఏసీబీకి చిక్కారు. ఆదాయానికి మించిన ఆస్తులు కూడబెట్టారన్న పక్కా సమాచారంతో ఏసీబీ అధికారులు దాడులు చేపట్టారు. హైదరాబాద్ తో పాటు ఉమ్మడి రంగారెడ్డి, ఇతర జిల్లాల పరిధిలోని మొత్తం 13 ప్రాంతాల్లో ప్రత్యేక బృందాలుగా ఏర్పడి ఏకకాలంలో తనిఖీలు చేపట్టారు. హైదరాబాద్ ఎర్రగడ్డలోని కల్పతరువు అపార్ట్మెంట్స్ లో లక్ష్మీ భాస్కర్ నివాసంతో పాటు నిమ్స్ ఆసుపత్రి ఓ పి డి బ్లాక్ మొదటి అంతస్తులోని ఆయన అధికారిక చాంబర్, బంధువులు, బినామీలుగా అనుమానిస్తున్న సన్నిహితుల ఇళ్లలో అధికారులు క్షుణ్ణంగా హోదాలు జరుపుతున్నారు. భారీగా అక్రమ ఆస్తులు బయటపడినట్లు ప్రచారం నడుస్తోంది.

కీలక డాక్యుమెంట్లు స్వాధీనం…

గత కొద్దికాలం గా నిమ్స్ అడిషనల్ సూపరిండెంట్ గా కొనసాగుతున్నారు డాక్టర్ లక్ష్మీ భాస్కర్. ఈ తనిఖీల్లో భారీగా స్థిరాస్తుల కొనుగోలు పత్రాలు, రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్లను ఏసీబీ అధికారులు గుర్తించి స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లోని ఓపెన్ ప్లాట్లు, విల్లాలు, వ్యవసాయ భూములకు సంబంధించిన కీలక పత్రాలతో పాటు విలువైన బంగారు ఆభరణాలు, నగదు నిల్వలను పనికి బృందాలు లెక్కిస్తున్నాయి. నిమ్స్ లో దాదాపు 20 ఏళ్లుగా పనిచేస్తున్నారు. ఐదేళ్లుగా అడిషనల్ సూపరింటెంట్ వంటి కీలక హోదాను అడ్డం పెట్టుకుని అక్రమ మార్గాల్లో భారీ ఆస్తులను కూడా పెట్టారని ఆరోపణలు ఉన్నాయి.

బ్యాంకు లాకర్లలో…

భారీగా బినామీలు ఆరోపణలు ఉన్నాయి. ఆయన కుటుంబ సభ్యుల పేరుతో పలు బ్యాంకు ఖాతాలు, ఫిక్స్డ్ డిపాజిట్లు, బ్యాంకు లాకర్లపై ఏసీబీ ప్రత్యేకంగా దృష్టి సారించింది. ఇప్పటికే పలు బ్యాంకు లాకర్ల లావాదేవీలు నిలిపివేసి.. పరిశీలించేందుకు అధికారులు సన్నద్ధం అవుతున్నారు. డాక్టర్ లక్ష్మీ భాస్కర్ పై గతంలోనూ లావాదేవీలు, పరిపాలనాపరమైన నిధుల మళ్లింపు ఆరోపణలు ఉన్నాయి. డాక్యుమెంట్లతో సహా ఆ పాత వ్యవహారాలకు ఏమైనా లింకులు ఉన్నాయా అన్న కోణంలో కూడా దర్యాప్తు వేగవంతం చేశారు.

పదుల కోట్లలో ఆస్తులు…

ప్రస్తుతం తనిఖీల్లో గుర్తించిన స్థిరాస్తుల డాక్యుమెంట్లు విలువతో పోలిస్తే బహిరంగ మార్కెట్ విలువ పదులకోట్లలోనే ఉంటాయని అంచనాలు ఉన్నాయి. డాక్టర్ లక్ష్మీ భాస్కర్ అధికారికంగా ప్రకటించిన వార్షిక ఆదాయానికి, క్షేత్రస్థాయిలో బయటపడుతున్న ఆస్తుల విలువకు ఏమాత్రం పొంతన లేకపోవడంతో పూర్తిస్థాయి వ్యత్యాసాన్ని లెక్కించే పనిలో పడ్డారు. అయితే ఇప్పుడు ఏసీబీ గురి అటు తిరిగి ఇటు తిరిగి నిమ్స్ పై పడటం వైద్య ఆరోగ్యశాఖలో గుబులు రేపుతోంది.

 

ఇవి కూడ చ‌ద‌వండి:

  1. ఒక్కసారిగా మారిన వాతావరణం… హైదరాబాద్ లో దంచికొడుతున్న వర్షం!

  2.  వైభవంగా 72వ జాతీయ చలనచిత్ర పురస్కారాల వేడుక.. విజేతలకు అవార్డులు అందజేసిన రాష్ట్రపతి!

  3. ఆయుధాల చోరీ కేసు.. పోలీసుల విచారణలో నిందితుడు మల్లేష్ కీలక నిజాలు వెల్లడి!

  4. ఒక లేఖ.. ఓ ఫోన్‌.. సీసీ కెమెరా! ఆత్మహత్య కాదు హ‌త్యా…?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు