Homeఆంధ్ర ప్రదేశ్ఏపీకి వాయుగండం!

ఏపీకి వాయుగండం!

– ఉత్తరాంధ్ర వైపు దూసుకొస్తున్న విపత్తు
– ఐదు రోజులపాటు విస్తారంగా వర్షాలు
– రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తం

తెలుగు రాష్ట్రాలకు భారీ వర్ష సూచన. బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం తీరం వైపు దూసుకొస్తుంది. దాదాపు ఐదు రోజులపాటు దీని ప్రభావం ఉండనుంది. కేవలం తెలుగు రాష్ట్రాలపై మాత్రమే కాదు దక్షిణ భారతదేశ పై ప్రభావం ఉంటుందని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. తీర ప్రాంతాలు, మైదాన ప్రాంతాల్లో గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ప్రచండ ఈదురు గాలులు వీచే అవకాశం ఉంది. అకస్మాత్తుగా ఆకాశం మేఘావృతమై కుండపోతగా వర్షం పడే ఛాన్స్ కూడా ఉంది. అందుకే ప్రజలు, ముఖ్యంగా ప్రయాణికులు, వాహనదారులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. మరోవైపు ఈశాన్య రాష్ట్రాలు, మధ్యప్రదేశ్, కొంకణ్ పరిసర ప్రాంతాల్లో కూడా భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం ఉంది.

బలపడిన అల్పపీడనం..
ఉత్తర అండమాన్ సముద్రంలో శుక్రవారం నాటికి ఏర్పడిన అల్పపీడనం మరింత బలపడింది. ఇది సోమవారం నాటికి వాయుగుండం గా మారింది. 22న తీవ్ర వాయుగుండం గా మారే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం అంచనా వేస్తోంది. అటు తరువాత ఒడిస్సా – ఏపీ తీరాల వైపు వేగంగా దూసుకు రానుంది. అందుకే ప్రధానంగా ఉత్తరాంధ్రలో ఐదు రోజులపాటు భారీ వర్షాలు నమోదయ్య చాన్స్ కనిపిస్తోంది. తూర్పు, దక్షిణ భారత ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కూడా కురిసే ఛాన్స్ ఉంది. ప్రధానంగా ఉత్తరాంధ్ర పై ప్రభావం చూపనుండడంతో రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తం అయ్యింది. ముందస్తు చర్యలు చేపట్టింది.

రుతుపవనాల నిష్క్రమణ..
ఈ ఏడాది నైరుతి రుతుపవనాల ఉపసంహరణ ప్రక్రియ అధికారికంగా ప్రారంభమైంది. సాధారణంగా సెప్టెంబర్ 17 నుంచి ఉపసంహరణ ప్రారంభమవ్వాల్సి ఉండగా.. ఈసారి రెండు రోజులు ఆలస్యంగా సెప్టెంబర్ 19న పశ్చిమ రాజస్థాన్ పరిసరాల నుంచి ఋతుపవనాలు వెనక్కి తగ్గడం మొదలైంది. రాబోయే మూడు నాలుగు రోజుల్లో రాజస్థాన్, పంజాబ్, గుజరాత్ పరిసర ప్రాంతాల నుంచి ఇవి పూర్తిగా నిష్క్రమించేందుకు వాతావరణం అనుకూలంగా ఉంది. అయితే వాయువ్యంలో రుతుపవనాలు వీడుతున్నప్పటికీ.. బంగాళాఖాతంలో బలం పుంజుకుంటున్న తుఫాను వ్యవస్థల వల్ల.. దక్షిణ, తూర్పు రాష్ట్రాల్లో రానున్న కొద్ది రోజులు వానలు ముప్పు కొనసాగనుంది.

Vengal Reddy
Vengal Reddyhttps://crimemirror.com/
2025 నుంచి "క్రైమ్ మిర్రర్" లో సీనియర్ సబ్‌ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. గత 4 ఏళ్లుగా వివిధ దినపత్రికల్లో-వెబ్ సైట్-సోషల్ మీడియా ఆప్స్' లలో కంటెంట్ క్రియేటర్ గా పని చేసిన అనుభవం ఉంది. పాలిటిక్స్‌, టెక్నాలజీ, లైఫ్‌ స్టైల్‌, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు