-
ఉప ఎన్నికల్లో అభ్యర్థులను నిలబెట్టుకోలేని స్థితిలో దీదీ
-
నందిగ్రామ్ లో అభ్యర్థి నామినేషన్ వెనక్కి
-
రేజినగర్ లో అతి కష్టం మీద నిలబడిన అభ్యర్థి
క్రైమ్ మిర్రర్, సెంట్రల్ డెస్క్: పశ్చిమ బెంగాల్లో మమతా బెనర్జీ పరిస్థితి మరింత దిగజారుతోంది. ఒకప్పుడు రాష్ట్రాన్ని శాసించిన ఆమె ఇప్పుడు ఉప ఎన్నికల్లో అభ్యర్థులను నిలపలేని పరిస్థితికి చేరుకోవడం ఆందోళన కలిగిస్తోంది. మమతా నేతృత్వంలోని తృణమూల్ కాంగ్రెస్ చీలిక వర్గాలకు ఎన్నికల సంఘం కొత్త పేర్లు, గుర్తులు కేటాయించడం.. అదే సమయంలో అభ్యర్థులు నామినేషన్లు ఉపసంహరించుకోవడం హాట్ టాపిక్ గా మారింది. నందిగ్రామ్ ఉప ఎన్నిక బరి నుంచి తప్పుకున్న తృణమూల్ అభ్యర్థి కలకలం రేపారు. అది మరువక ముందే రేజీనగర్ స్థానంలోనూ అనూహ్య పరిణామాలు చోటు చేసుకున్నాయి. అక్కడ కూడా అభ్యర్థి డ్రాప్ కావడం మమతా బెనర్జీకి షాక్ తగిలినట్లు అయ్యింది. బెంగాల్ ను తన కను సన్నలతో శాసించిన మమతాకు ఇది కోలుకోలేని దెబ్బ.
నామినేషన్ వెనక్కి…
Also Read: కారు రూపంలో వచ్చిన కాలయముడు.. మూడేళ్ల బాలుడు అక్కడికక్కడే దుర్మరణం!
నందిగ్రామ్ లో మమతా వర్గం తరపున పోటీ చేయాల్సిన అభ్యర్థి సంచిత ప్రధాన్ డే గడువు ముగిసే సమయానికి తన నామినేషన్ వెనక్కి తీసుకున్నారు. రాజకీయంగా ఇది కలకలం సృష్టించింది. నామినేషన్ ఉపసంహరణకు ముందు ఆమె సీఎం సువేందు అధికారిని కలవడం ప్రాధాన్యత సంతరించుకుంది. తన అభ్యర్థి తప్పుకోవడంతో మమతా బెనర్జీ దిక్కు తోచని స్థితికి చేరుకున్నారు. ఇండియా కూటమిలో భాగమైన కాంగ్రెస్ అభ్యర్థి మిలన్ ప్రధాన్ కు మద్దతు ప్రకటిస్తున్నట్లు హడావిడిగా ప్రకటించారు. కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలో నిలిచిన మిలన్ ప్రధాన్ పెండింగ్ లో ఉన్న పాత కేసుల కారణంగా అరెస్టు అయ్యారు.
మమతా ధైర్యం చెప్పడంతో…
Also Read:మోసం కేసులో ‘మహాభారత్’ భీముడు అరెస్ట్..
నందిగ్రామ్ పరిణామాల ప్రకంపనలు మరువకముందే.. ముర్షిదాబాద్ జిల్లాలోని రేజినగర్ బై పోల్ నుంచి మమత వర్గం అభ్యర్థి రబీవుల్ అలాం చౌదరి తప్పుకుంటున్నట్లు ప్రకటించడం కలకలం రేపింది. ప్రధానంగా పార్టీకి సాంప్రదాయంగా ఉన్న గడ్డి పూల గుర్తు కోల్పోవడం.. కొత్తగా కేటాయించిన ఫుట్బాల్ గుర్తును ప్రజల్లోకి తక్కువ సమయంలో తీసుకెళ్లడం కష్టం కావడం.. క్షేత్రస్థాయిలో పార్టీ కార్యకర్తలపై విపరీతమైన ఒత్తిడి, వేధింపులు పెరుగుతున్నాయని కారణాలతో ఆయన నామినేషన్ ఉపసంహరించుకుంటున్నట్లు ప్రకటించారు. అయితే వెంటనే మమతా బెనర్జీ స్వయంగా రంగంలోకి దిగారు. ఆయనతో మాట్లాడి పోలీసుల నుంచి భద్రతా భరోసా కల్పిస్తామని హామీతో.. అలం చౌదరి తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నారు. అయితే కనీస స్థాయిలో పోటీ ఇవ్వగలరా అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. మొత్తానికి అయితే ఒకప్పుడు బెంగాల్ ను ఏకచత్రాధిపత్యంతో ఏలిన మమతా బెనర్జీ.. ఇప్పుడు రెండు ఉప ఎన్నికలను సైతం ఎదుర్కోలేని స్థితికి వచ్చారంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు.
