Homeజాతీయంహస్తినలో కొట్టుకుపోయిన జెన్ జీ...!

హస్తినలో కొట్టుకుపోయిన జెన్ జీ…!

  • ఢిల్లీ యూనివర్సిటీ ఎన్నికల్లో ఏబీవీపీ ఘనవిజయం

  • ఇప్పటికీ యువత బిజెపి వెంటే

  • విపక్షాల ప్రచారం వట్టిమాటే

 

క్రైమ్ మిర్రర్, సెంట్రల్ డెస్క్: దేశవ్యాప్తంగా జెన్ జీ ప్రభావం విపరీతంగా నడుస్తోంది. రాజకీయాలపై విపరీతంగా ప్రభావం చూపనున్నట్లు సంకేతాలు వచ్చాయి. సరిగ్గా ఇటువంటి సమయంలోనే ఢిల్లీ యూనివర్సిటీ విద్యార్థి సంఘం ఎన్నికల ఫలితాలు.. దేశవ్యాప్తంగా నవతరం యువత జెన్ జీ మనోగతం పై జరుగుతున్న ప్రచారాలకు తెరదించాయి. కేంద్రంలో బిజెపి వరుసగా అధికారంలో ఉన్నందున.. ఉద్యోగాలు, నిరుద్యోగం, అగ్ని వీరు వంటి అంశాలను అడ్డం పెట్టుకొని జెన్ జీ ఓటర్లు బిజెపి, ఆర్ఎస్ఎస్ భావజాలానికి క్రమంగా దగ్గరవుతున్నారంటూ ఇండియా కూటమి, వామపక్ష వర్గాలు చేసిన ప్రచారాలు ఢిల్లీ యూనివర్సిటీ వేదికగా తేలిపోయాయి. ఆ యూనివర్సిటీ విద్యార్థి సంఘం ఎన్నికల్లో నాలుగు కీలక పోస్టుల్లో మూడింటిని ఏబీవీపీ ఏకపక్షంగా కైవసం చేసుకుంది. దేశంలోని అత్యంత ప్రతిష్టాత్మక విద్యాసంస్థల్లో నేటితరం యువత ఇప్పటికీ బీజేపీ అనుబంధ సంస్థల వైపే అత్యంత బలంగా ఉన్నారు అని తేలిపోయింది.

మినీ ఇండియా లాంటి క్యాంపస్…

Also Read:ప్రేమ, ఈర్ష్యతోనే యువతి మర్డర్.. లెక్చరర్‌తో పాటు మరో వ్యక్తి అరెస్ట్!

మినీ ఇండియా లాంటి క్యాంపస్ ఢిల్లీ యూనివర్సిటీ. దేశం నలుమూలల నుంచి వివిధ నేపథ్యాలు, సంస్కృతులు, సామాజిక వర్గాలకు చెందిన ప్రతిభావంతులైన దాదాపు లక్షన్నర మందికి పైగా విద్యార్థులు ఇక్కడ ప్రాతినిధ్యం వహిస్తుంటారు. అలాంటి చోట స్వచ్ఛందంగా పోలింగ్ బూత్ లకు వచ్చి ఏబీవీపీ అభ్యర్థులకు జై కొట్టారు. యువ ఓటర్లు మరోసారి మోదీ మార్క్ జాతీయవాదం, స్థిరమైన అభివృద్ధి అజెండాకే పట్టం కడుతున్నారని స్పష్టమవుతోంది. కేవలం భావోద్వేగ నినాదాలకి పరిమితం కాకుండా, లైబ్రరీ టైమింగ్స్ విస్తరణ, క్యాంపస్ స్పెషల్ మెట్రో ఫీడర్ బస్సులు, హాస్టల్ సదుపాయాలు, మహిళా భద్రత వంటి ప్రాక్టికల్ సమస్యలపై నిరంతరం పోరాడే ఏబీవీపీని విద్యార్థులు తమ గొంతుకగా ఎంచుకున్నారు.

పనిచేయని యాంటీ బీజేపీ...

Also Read:ఎన్‌కౌంటర్‌లో నిందితుడు మృతి, పాక్ సరిహద్దు నెట్‌వర్క్‌పై ఇన్వెస్టిగేషన్!

ఢిల్లీ యూనివర్సిటీ ఎన్నికల్లో కాంగ్రెస్ విద్యార్థి విభాగం ఎన్ ఎస్ యు ఐ తో పాటు వామపక్ష కూటమి విద్యార్థులు మధ్య యాంటీ బీజేపీ సెంటిమెంట్ పెద్దగా వర్కౌట్ కాలేదు. చివరికి ఆ వ్యతిరేకత కాంగ్రెస్ అంతర్గత కుమ్ములాటలకే దారితీసింది. తిరిగి కాంగ్రెస్ పార్టీకి చేటు తెచ్చింది. వ్యవస్థీకృతంగా విద్యార్థులను ఆకట్టుకోవడంలో ప్రతిపక్షాలు విఫలమయ్యాయి. విద్యార్థులకు నిరంతరం అందుబాటులో ఉంటూ.. క్యాంపస్ లలో విశ్వసనీయత సంపాదించుకోవడంలో ఏబీవీపీ వేసిన రూట్ మార్చేలా చేయడంలో విపక్షాలు విఫలమయ్యాయి. ఈ ఎన్నికల సరళిని చూస్తే విపక్షాల ప్రచారాన్ని నమ్మేస్థితిలో ప్రజలు లేరని స్పష్టమవుతుంది. యువత ఇప్పటికీ బిజెపి పై నమ్మకంగా ఉన్నారని ఈ ఎన్నికల ద్వారా తేలిపోయింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు