క్రైమ్ మిర్రర్ : పంజాబ్‌లోని అమృత్‌సర్‌లో అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్ (ASI) హర్జిత్ సింగ్ దారుణ హత్య కేసులో బిగ్ డెవలప్మెంట్ చోటుచేసుకుంది. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న దీపక్ సింగ్ పోలీసుల ఎన్కౌంటర్లో మృతి చెందగా, మరొక అనుమానితుడు స్పాట్ నుంచి ఎస్కేప్ అయ్యాడు. సెప్టెంబర్ 18న అమృత్సర్ పోలీస్ కంట్రోల్ రూమ్‌లో విధులు నిర్వర్తిస్తున్న ఏఎస్సై హర్జిత్ సింగ్ భగ్తన్వాలా గ్రెయిన్ మార్కెట్ ఏరియాకు వెళ్లగా, బైక్‌పై వచ్చిన ఇద్దరు దుండగులు ఆయనను ఫాలో అయ్యారు.
అత్యంత సమీపం నుంచి పిస్టల్‌తో ఓపెన్ ఫైర్ చేయడంతో హర్జిత్ సింగ్ తీవ్రంగా గాయపడి స్పాట్లోనే ప్రాణాలు కోల్పోయారు. ఘటనా స్థలంలో పోలీసులు .30 బోర్ వెపన్‌కు చెందిన ఖాళీ బుల్లెట్ కేసింగ్‌ను సీజ్ చేశారు. అనంతరం పంజాబ్ పోలీస్ డిపార్ట్మెంట్ సీసీటీవీ ఫుటేజ్, కాల్ డేటా మరియు టెక్నికల్ సర్వైలెన్స్ ఆధారంగా ఇన్వెస్టిగేషన్ వేగవంతం చేసి నిందితులను ఐడెంటిఫై చేశారు.
శనివారం నైట్ పోలీసులు ఒక చెక్ పోస్ట్ వద్ద రూటిన్ చెకింగ్ చేస్తుండగా, బైక్‌పై వచ్చిన ఇద్దరు అనుమానితులు అధికారులపైకి ఫైరింగ్ స్టార్ట్ చేశారు. సెల్ఫ్ డిఫెన్స్ కోసం పోలీసులు జరిపిన కౌంటర్ ఫైరింగ్‌లో ప్రధాన నిందితుడు దీపక్ సింగ్ తీవ్రంగా గాయపడ్డాడు. వెంటనే అతడిని హాస్పిటల్‌కు షిఫ్ట్ చేయగా, అప్పటికే డెడ్ అయినట్లు డాక్టర్లు కన్ఫర్మ్ చేశారు. ఎన్కౌంటర్ టైమ్‌లో తప్పించుకున్న మరో నిందితుడి కోసం స్పెషల్ టీమ్స్ సెర్చ్ ఆపరేషన్ రన్ చేస్తున్నాయి.
ఈ మర్డర్ వెనుక పాకిస్థాన్‌కు చెందిన టెర్రరిస్ట్ నెట్వర్క్ హ్యాండ్ ఉన్నట్లు క్రైమ్ బ్రాంచ్ దర్యాప్తులో షాకింగ్ ఫ్యాక్ట్స్ బయటపడ్డాయి. నిందితులకు బిగ్ అమౌంట్ మనీ ఆఫర్ చేయడంతో పాటు డ్రగ్ స్మగ్లింగ్ డీల్స్ కుదురుస్తామని ప్రామిస్ చేసి ఈ ఎటాక్‌కు ప్రేరేపించినట్లు ప్రాథమిక సమాచారం. ఒక సాధు సీనియర్ పోలీస్ ఆఫీసర్‌ను పాకిస్థాన్ ఆధారిత ఉగ్రవాదులు ఎందుకు టార్గెట్ చేశారనే దానిపై పంజాబ్ పోలీస్ హై-లెవెల్ ఎంక్వైరీ జరుపుతున్నారు.
also read : వినాయక చవితి వేడుకలు జరుపుకున్న కొద్ది గంటల్లోనే సాఫ్ట్వేర్ ఉద్యోగిని సూసైడ్..
