హైదరాబాద్, క్రైమ్‌మిర్రర్: హైదరాబాద్‌లోని ముషీరాబాద్ ప్రాంతంలో శుక్రవారం అర్థరాత్రి భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. వైఎస్ ఆర్ పార్కు సమీపంలో ఉన్న ఓ ఇంటిలో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో నిల్వ ఉంచిన డీజే పరికరాలు పూర్తిగా దగ్దమయ్యాయి. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణ నష్టం సంభవించలేదు. ఇంటిలో నుంచి పెద్ద ఎత్తున మంటలు, పొగ రావడాన్ని గమనించి స్థానికులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించడంతో వెంటనే ఫైర్ సిబ్బంది ఘటనస్థలానికి చేరుకొని అరగంటపాటు శ్రమించి మంటలను అదుపులోకి తీసుకొచ్చారు.
డీజే పరికరాలు పూర్తిగా దగ్డం…
Also Read:ఫిలిప్పీన్స్‌లో మళ్లీ కాల్పుల కలకలం.. బంగా పట్టణ స్కూల్‌లో 16 ఏళ్ల బాలుడి ఘాతుకం
అగ్నిప్రమాదం కారణంగా ఇంట్లో నిల్వ ఉంచిన డీజే పరికరాలు పూర్తిగా కాలిపోయినట్లు అధికారులు తెలిపారు. మంటలు ఇతర ఇళ్లకు వ్యాపించకుండా అగ్నిమాపక సిబ్బంది అప్రమత్తంగా చర్యలు చేపట్టారు. దీంతో పెద్ద ప్రమాదం తప్పినట్లయింది. ప్రాథమికంగా షార్ట్‌సర్క్యూట్ కారణంగానే మంటలు చెలరేగి ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. అయితే అగ్నిప్రమాదానికి అసలు కారణం ఏమిటన్నది దర్యాప్తు పూర్తయిన తర్వాతే స్పష్టమవుతుందని అధికారులు తెలిపారు. ముషీరాబాద్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.ఈ ఘటనతో స్థానికంగా కొద్దిసేపు ఆందోళన నెలకొంది. రాత్రి సమయంలో ఇంట్లో మంటలు చెలరేగడంతో చుట్టుపక్కల ప్రజలు అప్రమత్తమయ్యారు. అగ్నిమాపక సిబ్బంది సకాలంలో స్పందించి మంటలను అదుపులోకి తీసుకురావడంతో భారీ ప్రమాదం తప్పింది.
Also Read:ఆర్టీసీ క్రాస్ రోడ్స్ స్టీల్ బ్రిడ్జిపై నుంచి దూకి యువకుడి ఆత్మహత్య
