రోజులో ఏ సమయంలో టీ సేవించడం వల్ల ఆరోగ్యం మెరుగ్గా ఉంటుందనే అంశంపై పలు పరిశోధనలు ఆసక్తికరమైన విషయాలను వెల్లడించాయి. సాధారణంగా సాయంత్రం 4 నుంచి 5 గంటల మధ్య సమయంలో టీ తాగేందుకు సరైన సమయమని పరిశోధనలు స్పష్టం చేస్తున్నాయి. అయితే, ఈ సమయంలో టీ తీసుకోవడానికి ముందు కొన్ని ముఖ్యమైన ఆరోగ్య నియమాలను పాటించడం తప్పనిసరి. మధ్యాహ్నం భోజనం చేసిన సమయం నుండి అప్పటికి కనీసం 2 నుంచి 3 గంటలు దాటి ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు.అలాగే, ఎప్పుడూ ఖాళీ కడుపుతో టీ సేవించకుండా, చిన్నపాటి బిస్కట్లు లేదా ఏదైనా తేలికపాటి స్నాక్స్‌తో కలిపి తీసుకోవడం ద్వారా ఎసిడిటీ, కడుపు ఉబ్బరం వంటి అనారోగ్య సమస్యలను సులభంగా నివారించవచ్చు. మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే, సాయంత్రం 6 గంటలు దాటిన తర్వాత టీ తాగడం ఆరోగ్యానికి అంత మంచిది కాదని హెచ్చరిస్తున్నారు. ఆ సమయంలో టీ త్రాగితే అందులో ఉండే కెఫిన్ పదార్థం మెదడును చురుగ్గా ఉంచుతుందని, దీనివల్ల రాత్రి సరిగ్గా నిద్ర పట్టకపోవడంతో పాటు నిద్రకు భంగం కలిగే అవకాశం ఉందని అధ్యయనాలు పేర్కొంటున్నాయి. కాబట్టి సరైన వేళల్లో టీ తాగి అనారోగ్య ముప్పును దూరం చేసుకోండి.
దేశంలో భారీగా తగ్గనున్న బియ్యం ఉత్పత్తి.. పెరగనున్న ఆహార ధాన్యాల ధరలు, ఆందోళనలో సామాన్యులు!
శరీరంలో ఈ చిన్న లక్షణాలు కనిపిస్తున్నాయా? అయితే ఇవి ప్రాణాంతక వ్యాధులకు హెచ్చరికలు కావొచ్చు!
