హైదరాబాద్, క్రైమ్‌మిర్రర్: కేసులకు భయపడేది లేదని న్యాయవ్యవస్థపై అపార నమ్మకం ఉందని బీఆ ర్ ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ అన్నారు. శుక్రవారం నాంపల్లి ఏసీబీ కోర్టు వద్ద ఆయన మాట్టాడారు. హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ పెంచేందుకే ఫార్ములా ఈ రేస్ నిర్వహించామని తెలిపారు. అందులో అవినీతి జరిగిందని తప్పుడు కేసులు పెట్టారని ఆవేదన వ్యక్తం చేశారు. పోలీసులు ఎంత వేధించినా ప్రజాస్వామ్య పద్ధతిలో న్యాయవ్యవస్థ తమకు వెన్నుదన్నుగా ఉందని చెప్పారు. ఫార్ములా ఈ రేస్ కేసులో ఎప్పుడు విచారణకు పిలిచినా రావడానికి సిద్ధంగా ఉన్నట్లు స్పష్టం చేశారు.
Also Read:నా తండ్రి ప్రోత్సాహం ఎప్పటికీ మర్చిపోలేను- జేసన్ సంజయ్
అదే విధంగా తమిళనాడు సీఎం విజయ్ ఫార్ములా ఈ రేస్ కోసం లండన్ వెళ్లారని ఈ సందర్భంగా పేర్కొన్నారు.. పక్క రాష్ట్రాలు బ్రాండ్ ఇమేజ్ పెంచుకోవడం కోసం లండన్ వెళ్తుంటే ఇక్కడ తప్పుడు కేసులు పెడుతున్నారంటూ మండిపడ్డారు. టార్గెట్ కేసీఆర్‌గా కాంగ్రెస్ ప్రభుత్వం పని చేస్తోందని విమర్శించారు. లక్ష కోట్లు సంపాదించామని కాంగ్రెస్ ప్రభుత్వం తమపై అసత్య ఆరోపణలు చేస్తోందని ఫైర్ అయ్యారు. ‘రూ.1000 కోట్లు ఇచ్చి మా పేరుపై ఉన్న లక్ష కోట్ల ఆస్తులు తీసుకోవాలని ప్రభుత్వానికి సూచిస్తున్నాం. రూ.99 వేల కోట్లతో మీరు ఇచ్చిన హామీలను నెరవేర్చండి’ అంటూ కేటీఆర్ డిమాండ్ చేశారు.
Also Read:సమంత కొత్త జర్నీ.. గర్భంతోనే ‘మాస్టర్‌చెఫ్ తమిళ్’ షూటింగ్
