బాలీవుడ్ నటుడు విజయ్ వర్మపై సాఫ్ట్ పోర్న్ నటి నేహాల్ వడోలియా సంచలన ఆరోపణలు చేశారు. విజయ్ వర్మతో పాటు ఆయన పీఆర్ టీమ్ నుంచి తనకు బెదిరింపు కాల్స్ వస్తున్నాయని ఆమె పేర్కొన్నారు. ఈ మేరకు సోషల్ మీడియాలో ఓ వీడియోను షేర్ చేసి తన ఆవేదనను వ్యక్తం చేశారు.
తాను ఏ పాడ్‌క్యాస్ట్‌కు వెళ్లినా తన గొంతు నొక్కే ప్రయత్నం జరుగుతోందని నేహాల్ ఆరోపించారు. తనకు ఎదురవుతున్న పరిణామాలను బయటకు రాకుండా అడ్డుకుంటున్నారని ఆమె వాపోయారు. ఈ బెదిరింపుల కారణంగానే గత నాలుగున్నరేళ్లుగా ఎలాంటి ప్రాజెక్టులు చేయలేకపోయానని, కెరీర్‌కు దూరంగా ఉండాల్సి వచ్చిందని తెలిపారు.
తనకు ఎదురైన పరిస్థితులతో తీవ్రంగా విసిగిపోయానని చెప్పిన నేహాల్.. మనుషుల కంటే జంతువులే నయం అంటూ తన అసంతృప్తిని వ్యక్తం చేశారు. ప్రస్తుతం ఆమె చేసిన ఈ ఆరోపణలకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. అయితే నేహాల్ చేసిన ఆరోపణలపై విజయ్ వర్మ లేదా ఆయన పీఆర్ టీమ్ నుంచి అధికారిక స్పందన రావాల్సి ఉంది.
also read: వైష్ణవి చైతన్యకు చేదు అనుభవం.. ‘బేబి’ తర్వాత అలా జరిగిందట!
