‘బేబి’ సినిమాతో హీరోయిన్గా మంచి గుర్తింపు తెచ్చుకున్న నటి వైష్ణవి చైతన్య.. ఆ సినిమా విడుదల తర్వాత ఎదురైన కొన్ని చేదు అనుభవాలను తాజాగా గుర్తుచేసుకున్నారు. ‘బేబి’ తనకు ఒక్కసారిగా వచ్చిన విజయమేమీ కాదని, చాలా కాలంగా సినీ రంగంలో అవకాశాల కోసం కష్టపడుతూ ఈ స్థాయికి చేరుకున్నానని ఆమె తెలిపారు.
కవర్ సాంగ్స్, షార్ట్ ఫిల్మ్స్‌తో పాటు పలు క్యారెక్టర్ రోల్స్ చేస్తూ తన ప్రయాణాన్ని కొనసాగించానని వైష్ణవి చెప్పారు. ఆ తర్వాత ‘బేబి’ సినిమా తన కెరీర్లో కీలక మలుపుగా మారిందని పేర్కొన్నారు.
అయితే సినిమా విడుదలైన అనంతరం కొందరి నుంచి తీవ్ర స్థాయిలో నెగటివిటీ ఎదురైందని ఆమె వెల్లడించారు. సినిమా చూసిన తర్వాత కొందరు తనపై అసభ్యకరమైన పదజాలంతో వ్యాఖ్యలు చేశారని తెలిపారు. అంతేకాకుండా కొన్ని చోట్ల సినిమా పోస్టర్లను చెప్పులతో కొట్టడం వంటి ఘటనలు కూడా తనను తీవ్రంగా బాధించాయని చెప్పారు.
ఆ పరిణామాలు తనపై మానసికంగా చాలా ప్రభావం చూపించాయని వైష్ణవి చైతన్య పేర్కొన్నారు. ఒక నటిగా పాత్రకు సంబంధించిన విమర్శలను స్వీకరించగలనని, కానీ వ్యక్తిగతంగా అవమానించే విధంగా వ్యవహరించడం మాత్రం ఎంతో బాధ కలిగించిందని ఆమె అభిప్రాయపడ్డారు.
‘బేబి’ విజయంతో వచ్చిన గుర్తింపుతో పాటు ఎదురైన నెగటివిటీని కూడా తన ప్రయాణంలో భాగంగానే చూస్తున్నానని వైష్ణవి చైతన్య తెలిపారు.
also read: ఎద్దు దాడిలో మూడేళ్ల చిన్నారి.. కాపాడేందుకు వెళ్లిన తల్లిపైనా దాడి
