Homeసినిమాతెలుగులోకి ‘హనుమాన్ అన్ష్’... త్రివిక్రమ్ సమర్పణలో ఈ నెల 18న విడుదల

తెలుగులోకి ‘హనుమాన్ అన్ష్’… త్రివిక్రమ్ సమర్పణలో ఈ నెల 18న విడుదల

ఆధ్యాత్మిక గురువు నీమ్ కరోలీ బాబా జీవితం, ఆయన ఆధ్యాత్మిక ప్రయాణం ఆధారంగా రూపొందిన చిత్రం ‘హనుమాన్ అన్ష్’. ఈ సినిమా ఇప్పటికే మంచి విజయాన్ని అందుకున్న నేపథ్యంలో తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు మేకర్స్ సిద్ధమయ్యారు. ఈ నెల 18న ఈ చిత్రం తెలుగు వెర్షన్‌లో విడుదల కానుంది.

దర్శకుడు త్రివిక్రమ్ సమర్పణలో ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ ఈ చిత్రాన్ని తెలుగు ప్రేక్షకులకు అందిస్తోంది. డా. విశాల్ చతుర్వేది దర్శకత్వం వహించిన ఈ సినిమాను రాగిని ఎస్, నమ్రత జి. సింగ్, అనుప్రియ సంయుక్తంగా నిర్మించారు.

ఆధ్యాత్మికత, భక్తి, నీమ్ కరోలీ బాబా జీవితంలోని ముఖ్యమైన అంశాలను తెరపై ఆవిష్కరించేలా ఈ చిత్రాన్ని రూపొందించినట్లు తెలుస్తోంది. శోభిత్ శ్రీవాస్తవ, చందన్ ఆనంద్, పూర్ణిమ తివారి, విహాన్ షెగ్డే తదితరులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు.

ఇప్పటికే ప్రేక్షకుల నుంచి స్పందన అందుకున్న ఈ ఆధ్యాత్మిక నేపథ్య చిత్రం తెలుగులో ఎలాంటి ఆదరణ పొందుతుందనేది ఆసక్తికరంగా మారింది. ఈ నెల 18 నుంచి తెలుగు రాష్ట్రాల్లో ‘హనుమాన్ అన్ష్’ సందడి చేయనుంది.

also read: ఓటర్ల జాబితా వ్యవహారం.. మహేష్ బాబు నుంచి సైనా నెహ్వాల్ వరకు ప్రముఖులకు నోటీసులు

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు