తెలంగాణలో ఓటర్ల జాబితా పునర్వ్యవస్థీకరణ ప్రక్రియ కొనసాగుతున్న వేళ పలువురు ప్రముఖుల పేర్లు చర్చనీయాంశంగా మారాయి. ఎన్యూమరేషన్ పత్రాల్లో పేర్ల నమోదుకు సంబంధించిన కొన్ని పొరపాట్ల కారణంగా ఎన్నికల సంఘం పలువురు సినీ, క్రీడా రంగ ప్రముఖులకు నోటీసులు జారీ చేసినట్లు సమాచారం.
ఈ జాబితాలో టాలీవుడ్ ప్రముఖులు మహేష్ బాబు, దర్శకుడు రాజమౌళి, నమ్రత, నటుడు వెంకటేష్, సమంత, విజయ్ దేవరకొండతో పాటు ఉపాసన పేర్లు ఉన్నట్లు తెలుస్తోంది. క్రీడా రంగానికి చెందిన వీవీఎస్ లక్ష్మణ్, మిథాలీ రాజ్, పుల్లెల గోపీచంద్, సైనా నెహ్వాల్ తదితరులకు కూడా నోటీసులు అందినట్లు సమాచారం.
తెలంగాణలో ఓటర్ల జాబితా పునర్వ్యవస్థీకరణలో భాగంగా ఎన్యూమరేషన్ వివరాలను పరిశీలిస్తున్న సమయంలో పేర్ల నమోదులో తలెత్తిన తప్పిదాలు ఈ నోటీసులకు కారణంగా తెలుస్తోంది. సంబంధిత వివరాలపై స్పష్టత కోసం ఎన్నికల అధికారులు నోటీసులు జారీ చేసినట్లు సమాచారం.
ఇదిలా ఉండగా, సినీ, క్రీడా ప్రముఖులకు ఎన్నికల సంఘం నోటీసులు జారీ చేసిందన్న వార్తలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఈ వ్యవహారంపై మరింత స్పష్టత రావాల్సి ఉంది.
also read: హైదరాబాద్‌లో విషాదం.. ఆర్టీసీ బస్సు ఢీకొని యువతి మృతి
