Homeక్రైమ్పంజాబ్ నేషనల్ బ్యాంకులో భారీ కుంభకోణం: అసలు నోట్లకు బదులు నకిలీ కరెన్సీ!

పంజాబ్ నేషనల్ బ్యాంకులో భారీ కుంభకోణం: అసలు నోట్లకు బదులు నకిలీ కరెన్సీ!

ఉత్తరప్రదేశ్‌లోని సహారన్‌పూర్ జిల్లాలో దారుణమైన బ్యాంకు కుంభకోణం వెలుగుచూసింది. ప్రజలు నమ్మకంతో దాచుకునే బ్యాంకులోనే రక్షణ కరువైంది. ఏకంగా బ్యాంకు ఉద్యోగులే కంచె చేను మేసిన చందంగా బ్యాంకుకు ఎసరు పెట్టారు. పంజాబ్ నేషనల్ బ్యాంకు (PNB)లో జరిగిన ఈ ఘరానా మోసం అందరినీ విస్తుపోయేలా చేస్తోంది.

అసలేం జరిగిందంటే..
పంజాబ్ నేషనల్ బ్యాంకులోని కరెన్సీ చెస్ట్ (డబ్బు దాచే గది)కి బాధ్యులైన ముగ్గురు సీనియర్ మేనేజర్లు చేతివాటం ప్రదర్శించారు. బ్యాంకులో భద్రంగా ఉన్న అసలు కరెన్సీ నోట్లను దొంగిలించి, వాటి స్థానంలో ఏకంగా రూ. 7.4 కోట్ల విలువైన నకిలీ (ఫేక్) కరెన్సీ నోట్లను పెట్టారు. బ్యాంకు లాకర్‌లలో ఉండాల్సిన అసలు నగదుకు బదులుగా కట్టలకొద్దీ నకిలీ నోట్లను ఉంచి ఎవరికీ అనుమానం రాకుండా జాగ్రత్త పడ్డారు.

గుట్టు రట్టయింది ఇలా..

ఈ మోసం ఎన్నాళ్ల నుంచో సాగుతున్నప్పటికీ, ఆగస్టు 10వ తేదీన జరిగిన ఒక సంఘటనతో వారి బండారం బయటపడింది. ఆ రోజున బ్యాంకు అధికారులు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI)కి కొంత నగదును పంపించారు. అయితే, RBI అధికారులు పంపిన నగదును లెక్కించగా అందులో రూ. 4.36 లక్షలు తక్కువగా ఉన్నట్లు గుర్తించారు. నగదు లెక్కల్లో ఇంత పెద్ద వ్యత్యాసం రావడంతో RBI అధికారులు వెంటనే అప్రమత్తమయ్యారు.సహారన్‌పూర్‌లోని పంజాబ్ నేషనల్ బ్యాంకు శాఖలో సమగ్ర ఆడిట్ నిర్వహించాలని RBI ఆదేశాలు జారీ చేసింది. RBI ఆదేశాల మేరకు బ్యాంకు ఉన్నతాధికారులు రంగంలోకి దిగి లోతైన విచారణ మరియు ఆడిట్ నిర్వహించారు. ఈ ఆడిట్ ప్రక్రియలోనే అసలు నిజం నిగ్గుతేలింది. బ్యాంకు లాకర్‌లో ఉన్నవి అసలు నోట్లు కావని, అవి రూ. 7.4 కోట్ల విలువైన ఫేక్ కరెన్సీ అని అధికారులు నిర్ధారించారు.

చర్యలకు ఉపక్రమించిన బ్యాంకు అధికారులు

ఈ భారీ మోసానికి పాల్పడినట్లు ప్రాథమిక విచారణలో తేలడంతో బ్యాంకు యాజమాన్యం కఠిన చర్యలు తీసుకుంది. ఈ కుంభకోణంలో ప్రమేయం ఉన్న ముగ్గురు సీనియర్ మేనేజర్లను తక్షణమే విధుల్లో నుంచి సస్పెండ్ చేసింది. అంతేకాకుండా, వారిపై స్థానిక పోలీసు స్టేషన్‌లో క్రిమినల్ కేసు కూడా నమోదు చేశారు.
ఈ సంఘటన బ్యాంకింగ్ రంగంలో తీవ్ర కలకలం రేపుతోంది. నమ్మకంగా డబ్బు దాచుకునే బ్యాంకులోనే ఇలాంటి ఘటనలు జరగడం ప్రజల్లో ఆందోళన కలిగిస్తోంది. పోలీసులు ఈ కేసును తీవ్రంగా పరిగణించి దర్యాప్తు ముమ్మరం చేశారు. దొంగిలించిన అసలు నగదు ఎక్కడికి వెళ్లింది? ఈ నకిలీ కరెన్సీ నెట్‌వర్క్ వెనుక ఇంకెవరున్నారు? అనే కోణాల్లో విచారణ కొనసాగుతోంది.

అంబర్‌పేట్‌లో ఏఆర్ కానిస్టేబుల్ ఆత్మహత్య.. వాట్సాప్‌లో స్నేహితులకు చివరి సమాచారం

Vengal Reddy
Vengal Reddyhttps://crimemirror.com/
2025 నుంచి "క్రైమ్ మిర్రర్" లో సీనియర్ సబ్‌ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. గత 4 ఏళ్లుగా వివిధ దినపత్రికల్లో-వెబ్ సైట్-సోషల్ మీడియా ఆప్స్' లలో కంటెంట్ క్రియేటర్ గా పని చేసిన అనుభవం ఉంది. పాలిటిక్స్‌, టెక్నాలజీ, లైఫ్‌ స్టైల్‌, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు