పాన్ ఇండియా స్టార్ ప్రభాస్‌కు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. దేశవ్యాప్తంగా భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్నప్పటికీ ఆయన మాత్రం ఎంతో సింపుల్‌గా, కూల్‌గా ఉండటానికి ఇష్టపడుతుంటారు. తాజాగా ‘స్పిరిట్’ మూవీ నిర్మాత ప్రణయ్ రెడ్డి వంగా ప్రభాస్ వ్యక్తిత్వానికి సంబంధించిన ఆసక్తికర విషయాన్ని వెల్లడించారు.
‘స్పిరిట్’ టైటిల్‌ను ప్రకటించే సమయంలో ప్రభాస్ పేరు ముందు ‘ఇండియాస్ బిగ్గెస్ట్ సూపర్‌స్టార్’ అనే ట్యాగ్‌ను ఉపయోగించాలని మేకర్స్ నిర్ణయించారట. ఈ విషయాన్ని ప్రభాస్‌తో చెప్పినప్పుడు ఆయన పెద్దగా స్పందించకుండా చాలా క్యాజువల్‌గా.. “మీ ఇష్టం డార్లింగ్” అంటూ సమాధానం ఇచ్చారని ప్రణయ్ రెడ్డి వంగా తెలిపారు.
ప్రభాస్ ఇచ్చిన ఈ చిన్న సమాధానం ఆయన స్వభావాన్ని స్పష్టంగా తెలియజేస్తుందని నిర్మాత పేర్కొన్నారు. తన పేరుకు ఎలాంటి ట్యాగ్ పెట్టినా, తనను ఎలా ప్రమోట్ చేసినా వాటి గురించి పెద్దగా పట్టించుకోకుండా మేకర్స్‌పై నమ్మకం ఉంచడం ప్రభాస్ ప్రత్యేకత అని చెప్పారు.
స్టార్‌డమ్‌ను ఆస్వాదిస్తూనే ఎలాంటి హంగామా లేకుండా సింపుల్‌గా ఉండే ప్రభాస్ వ్యక్తిత్వం మరోసారి అభిమానులను ఆకట్టుకుంటోంది. సినిమాకు సంబంధించిన విషయాల్లో దర్శకుడు, నిర్మాతలపై నమ్మకం ఉంచి ముందుకు సాగడం ఆయన స్టైల్ అని ప్రణయ్ రెడ్డి వంగా చెప్పిన మాటలు ఇప్పుడు సోషల్ మీడియాలో ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి.
ఇక ‘స్పిరిట్’ చిత్రంపై ప్రభాస్ అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమాకు సంబంధించిన మరిన్ని వివరాలు, అప్‌డేట్స్ కోసం ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
also read: తుమకూరులో విషాదం.. కూలిన డెయిరీ పిల్లర్‌కు విద్యార్థి బలి
