Homeక్రైమ్కుప్పకూలిన 7 అంతస్థుల భవనం...అసలు అనుమతులు ఎవరిచ్చారు...?

కుప్పకూలిన 7 అంతస్థుల భవనం…అసలు అనుమతులు ఎవరిచ్చారు…?

  • చిన్న ప్లాట్.. 7, 8 అంతస్తుల భవనాలు..!

  • అక్రమ నిర్మాణాలపై ముందుగానే ప్లాట్ నంబర్లతో సహా మున్సిపల్ కమిషనర్‌కు ఫిర్యాదు…!

  • నిబంధనలకు విరుద్ధంగా భారీ నిర్మాణాలు జరుగుతున్నాయంటూ ఆరోపణలు

  • అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదంటూ ఫిర్యాదుదారు ఆవేదన

క్రైమ్ మిర్రర్, కొండాపూర్: చిన్న విస్తీర్ణంలోని ప్లాట్లలో నిబంధనలకు విరుద్ధంగా భారీ బహుళ అంతస్తుల భవనాలు నిర్మిస్తున్నారనే ఆరోపణలు కలకలం రేపుతున్నాయి. ఈ వ్యవహారంపై సంబంధిత మున్సిపల్ కమిషనర్‌కు ఫిర్యాదు అందింది. జూన్ 15, 2026న సమర్పించిన ఫిర్యాదులో పలు నిర్మాణాలకు సంబంధించిన వివరాలను అధికారుల దృష్టికి తీసుకెళ్లారు.

ఫిర్యాదులో పేర్కొన్న వివరాల ప్రకారం.. సుమారు 50 నుంచి 100 గజాల పరిధిలో ఉన్న చిన్న ప్లాట్లలోనే 7, 8 అంతస్తుల భారీ భవనాల నిర్మాణాలు చేపడుతున్నారని ఆరోపించారు. ఇలాంటి నిర్మాణాలకు అవసరమైన నిబంధనలు, అనుమతులు, సెట్‌బ్యాక్‌లు, నిర్మాణ భద్రతా ప్రమాణాలు పాటిస్తున్నారా? అనే అంశాలపై అనుమానాలు వ్యక్తం చేశారు.

  • ఫిర్యాదులు చేసినా చర్యలు లేవా?

అక్రమ నిర్మాణాలపై ఇప్పటికే సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లినప్పటికీ ఆశించిన స్థాయిలో చర్యలు తీసుకోలేదని ఫిర్యాదుదారు ఆరోపించారు. నిర్మాణాలు పూర్తయిన తర్వాత చర్యలు తీసుకోవడం కంటే, నిర్మాణ దశలోనే అధికారులు తనిఖీలు నిర్వహించి నిబంధనలకు విరుద్ధంగా ఉన్న వాటిని అడ్డుకోవాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు.

చిన్న ప్లాట్‌లో బహుళ అంతస్తుల నిర్మాణానికి అనుమతి ఎలా లభించింది? ఆమోదించిన భవన నిర్మాణ ప్లాన్‌కు అనుగుణంగానే నిర్మాణం జరుగుతోందా? ఒకవేళ నిబంధనలకు విరుద్ధంగా నిర్మాణం జరుగుతుంటే సంబంధిత అధికారులు ఎందుకు స్పందించలేదు? అనే ప్రశ్నలు ఇప్పుడు తెరపైకి వస్తున్నాయి.

  • ప్లాట్ నంబర్లతో సహా ఫిర్యాదు

ఫిర్యాదులో పలు నిర్మాణాలకు సంబంధించిన ప్లాట్ నంబర్లను కూడా ప్రస్తావించారు. Road No.2, Plot No.161/3; Road No.3, Plot No.1555; Road No.4, Plot Nos.1446, 1447; Road No.5, Plot No.230 తదితర వివరాలను అధికారుల దృష్టికి తీసుకువచ్చారు.

ఈ నిర్మాణాలకు సంబంధించిన అనుమతులు, ఆమోదిత ప్లాన్లు, నిర్మాణ విస్తీర్ణం, అంతస్తుల సంఖ్య, సెట్‌బ్యాక్‌లు తదితర అంశాలను క్షేత్రస్థాయిలో పరిశీలించాలని ఫిర్యాదుదారు కోరారు.

  • అసలు అనుమతులు ఎవరిచ్చారు?

చిన్న స్థలాల్లో భారీ అంతస్తుల నిర్మాణాలకు అనుమతులు మంజూరు చేశారా? ఒకవేళ అనుమతులు ఉంటే ఏ నిబంధనల ప్రకారం ఇచ్చారు? నిర్మాణదారులు ఆమోదిత ప్లాన్‌ను ఉల్లంఘించారా? నిర్మాణాలపై అధికారులు ఎప్పటికప్పుడు తనిఖీలు నిర్వహించారా? అన్న అంశాలపై సమగ్ర విచారణ జరపాల్సిన అవసరం ఉందని ఫిర్యాదుదారు కోరుతున్నారు.

మున్సిపల్ కమిషనర్ ఈ ఫిర్యాదుపై స్పందించి సంబంధిత అధికారులతో క్షేత్రస్థాయి పరిశీలన చేయించి, నిబంధనలకు విరుద్ధంగా నిర్మాణాలు జరుగుతున్నట్లు తేలితే బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.

చిన్న ప్లాట్‌కు ఇంత పెద్ద నిర్మాణం ఎలా సాధ్యమైంది..?
అనుమతులు ఎవరిచ్చారు..?
నిర్మాణాలపై అధికారుల పర్యవేక్షణ ఎక్కడ..?
అక్రమ నిర్మాణాలకు అండగా ఎవరున్నారు..?
ఈ ప్రశ్నలకు మున్సిపల్ అధికారులు ఇచ్చే సమాధానాలపై ఇప్పుడు ఆసక్తి నెలకొంది.

Anji Peraboina
Anji Peraboinahttp://www.crimemirror.com
పేరబోయిన ఆంజనేయులు ప్రస్తుతం క్రైమ్ మిర్రర్ తెలుగు దినపత్రికలో సీనియర్ డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు. తెలంగాణకు సంబంధించిన తాజా వార్తలు, ప్రభుత్వ పథకాల అప్డేట్లు, మౌలిక సదుపాయాల అభివృద్ధి, రాజకీయ పరిణామాలు మరియు ప్రత్యేక కథనాలను సమగ్రంగా అందిస్తున్నారు. జర్నలిజం రంగంలో 7 సంవత్సరాలకు పైగా అనుభవం కలిగిన ఆయన, గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో రాష్ట్ర వార్తలు మరియు రాజకీయ విశ్లేషణలు రాశారు. క్షేత్రస్థాయిలో రాజకీయ సర్వేల్లో పాల్గొన్న అనుభవంతో పాటు, క్రైమ్ ఇన్వెస్టిగేషన్ మరియు పరిశోధనాత్మక జర్నలిజంలో ప్రత్యేక నైపుణ్యం సంపాదించారు. తెలంగాణ రాజకీయ పరిణామాలపై లోతైన అవగాహనతో పాటు, ప్రజలకు నమ్మకమైన సమాచారం అందించడంలో అంజి కృషి కొనసాగుతోంది. తన ప్రతిభకు గుర్తింపుగా, 2025 ఆగస్టులో ఉత్తమ పనితీరు కోసం జర్నలిస్టు అవార్డు అందుకున్నారు.

తాజావార్తలు