-
నిజామాబాద్ ఎంపీ ఫిర్యాదుతో నిరాకరించిన కేంద్ర విదేశీ వ్యవహారాల శాఖ?
-
తెలంగాణ పొలిటికల్ సర్కిల్స్లో సరికొత్త ప్రచారం
-
కాంగ్రెస్,బిజెపి మధ్య కొత్త వివాదం
క్రైమ్ మిర్రర్, తెలంగాణ బ్యూరో: సీఎం రేవంత్ అమెరికా పర్యటనకు బ్రేక్ వేసింది ఎవరు? భారత విదేశాంగ శాఖకు ఫిర్యాదు చేసింది ఎవరు? దీని వెనుక నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ ఉన్నారన్న ప్రచారం జోరుగా సాగుతోంది. కేంద్ర నిఘా వర్గాలకు ఆయనే ఫిర్యాదు చేశారన్న ప్రచారం సాగుతోంది.
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి లండన్ పర్యటనతో పాటు అమెరికా పర్యటనకు ప్లాన్ చేసుకున్న సంగతి తెలిసిందే. అయితే లండన్ పర్యటన వరకు ఓకే కానీ.. అమెరికా పర్యటనకు మాత్రం కేంద్ర విదేశాంగ మంత్రిత్వ శాఖ అభ్యంతరం తెలిపింది. అమెరికా పర్యటన రద్దు చేసుకోవాలని సూచించింది. దీంతో పర్యటనను రద్దు చేసుకున్న సీఎం రేవంత్ ఈనెల 23న తెలంగాణ చేరుకొనున్నారు.
-
మీడియాతో సంచలన కామెంట్స్..
సీఎం రేవంత్ రెడ్డి అమెరికా పర్యటన నిలిచిపోవడం వెనుక ధర్మపురి అరవింద్ ఉన్నారన్న ప్రచారం తెలంగాణ పొలిటికల్ సర్కిల్స్ లో బలంగా వినిపిస్తోంది. ఇటీవల ఓ మీడియా సమావేశంలో మాట్లాడారు అరవింద్. తెలంగాణ సీఎం విదేశీ పర్యటనపై సంచలన వ్యాఖ్యలు చేశారు. యాంటీ ఇండియా భావజాలం ఉన్నవారిని అమెరికాలో రేవంత్ కలుస్తున్నారని.. యాంటీ సోషలిస్ట్ భావజాల యూనివర్సిటీలో సీఎం పర్యటన కరెక్ట్ కాదు అని అరవింద్ కామెంట్స్ చేశారు.
ఇండియా ప్రైమ్ విషయం చిమ్మే వారితో సమావేశాలు నిర్వహించడం సరికాదు అని అభిప్రాయపడ్డారు. అరవింద్ ఈ వ్యాఖ్యలు చేసిన కొద్ది రోజుల్లోనే రేవంత్ అమెరికా పర్యటనకు విదేశీ వ్యవహారాల శాఖ అనుమతి నిరాకరించింది. దీంతో ఇప్పుడు అన్ని వేళ్ళు ధర్మపురి అరవింద్ వైపు చూపిస్తున్నాయి.
-
నేడు హైదరాబాద్ కు రేవంత్..
మరోవైపు తన అమెరికా పర్యటన రద్దు పై సీఎం రేవంత్ సైతం సంచలన వ్యాఖ్యలు చేశారు. రాజకీయ కారణాలతోనే తన టూర్ ను కేంద్రం రద్దు చేసిందని.. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం తనకు షాక్ కు గురిచేసింది అంటూ ఒక ప్రకటన విడుదల చేశారు రేవంత్. మరోవైపు సీఎం రేవంత్ అమెరికా టూర్ కు అనుమతి నిరాకరణ పై రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుడు వి హనుమంతరావు ఆక్షేపించారు.
ఇది ఎంత మాత్రం సరికాదు అని అభిప్రాయపడ్డారు. అయితే ఈ మొత్తం ఎపిసోడ్ వెనుక నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ ఉన్నారని తెలుస్తుండడం తెలంగాణ పొలిటికల్ సర్కిల్స్లో హీట్ పుట్టిస్తోంది. దీనిపై మున్ముందు కాంగ్రెస్ వర్సెస్ బిజెపి అన్నట్టుగా పరిస్థితి మారనుంది. ఈనెల 23న రేవంత్ లండన్ రానున్నారు.
వాస్తవానికి ముఖ్యమంత్రుల విదేశీ పర్యటనలకు సంబంధించి ప్రోటోకాల్ నిబంధనల ప్రకారం కేంద్ర విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ నుంచి అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. అయితే యూకే పర్యటనకు ఓకే చెప్పిన కేంద్ర విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ అమెరికా పర్యటనకు మాత్రం మొండి చేయి చూపింది.
