Homeతెలంగాణకాంగ్రెస్ లో ఇమడలేరు.. బిఆర్ఎస్ లో చేరలేరు...!

కాంగ్రెస్ లో ఇమడలేరు.. బిఆర్ఎస్ లో చేరలేరు…!

  • తీవ్ర అంతర్మధనంలో ఫిరాయింపు ఎమ్మెల్యేలు

  • హైకోర్టులో ముగిసిన వాదనలు

  • సెప్టెంబర్ 16న తుది తీర్పు

క్రైమ్ మిర్రర్, తెలంగాణ బ్యూరో: తెలంగాణలో ఫిరాయింపు ఎమ్మెల్యేలు తీవ్ర ఆందోళనతో ఉన్నారా? అటు కాక ఇటు కాక పోయామని బాధతో ఉన్నారా? సెప్టెంబర్ 17న తీర్పు ఎలా ఉండబోతుందన్న ఆందోళన వారిని వెంటాడుతుందా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది.

జరుగుతున్న పరిణామాలు అలానే ఉన్నాయి. 2024 సార్వత్రిక ఎన్నికలకు ముందు, తరువాత చాలామంది గులాబీ పార్టీ ఎమ్మెల్యేలు అధికార కాంగ్రెస్కు దగ్గరయ్యారు. అప్పట్లో గులాబీ పార్టీ వరుస అపజయాలతో ఈ నిర్ణయం తీసుకున్నారు. అయితే ఇప్పుడు అనర్హత వేటు పడుతుండడం.. కాంగ్రెస్ పార్టీలో పరిస్థితి చేయి దాటుతుండడంతో వారిలో పునరాలోచన ప్రారంభమైనట్లు తెలుస్తోంది.

  • రకరకాల కారణాలతో ఫిరాయింపు..

ఎమ్మెల్యేలుగా గెలిచారు కానీ పార్టీ అధికారంలోకి రాలేదు.. అందుకే పట్టు సాధించడానికి కొందరు.. పవర్ సెంటర్ కు దగ్గరగా ఉండడానికి మరికొందరు గులాబీ పార్టీ నుంచి కాంగ్రెస్ లోకి ఫిరాయించారు. దానం నాగేందర్, పోచారం శ్రీనివాస్ రెడ్డి, అరికెపూడి గాంధీ, ప్రకాష్ గౌడ్ వంటి కీలక నేతలు గులాబీ జెండాను పక్కనపెట్టి కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు.

అయితే రెండేళ్లు గడిచేసరికి.. అధికార పార్టీలో చేరి తప్పు చేశామా అనే ఆవేదన వారిలో కనిపిస్తోంది. కాంగ్రెస్ నాయకత్వం ఈ ఫిరాయింపు ఎమ్మెల్యేలకు అనుకున్న స్థాయిలో రాజకీయ భద్రత కానీ.. న్యాయపరమైన రక్షణ కానీ కల్పించలేక పోయిందని ప్రధాన ఆరోపణ. వారు కాంగ్రెస్లో చేరలేదని చెప్పి అనర్హత వేటు నుంచి తప్పించారు కానీ.. రాజకీయంగా గ్యారెంటీ ఇవ్వలేకపోతున్నారు.

పార్టీలో చేరితే రాజభవనం లాంటి గౌరవం ఇస్తాం.. పదవులు కల్పిస్తాం అని నమ్మబలికి పిలుచుకున్న పెద్దలు.. తీరా న్యాయపరమైన అడ్డంకులు ఎదురుకాగానే తమను ఒంటరిని చేశారనే భావన ఈ ఫిరాయింపు ఎమ్మెల్యేలు బలపడింది.

  • దొరకని ప్రాధాన్యత..

అయితే ఇలా ఫిరాయించిన ఎమ్మెల్యేలకు కాంగ్రెస్ పార్టీ శ్రేణులు పెద్దగా ప్రాధాన్యత ఇవ్వడం లేదు. ఆయా నియోజకవర్గాల్లో పాత కాంగ్రెస్ నేతలు పట్టు బిగిస్తున్నారు. అలా అని పిలిచిన పెద్దలు గట్టిగా చెప్పడం లేదు. దశాబ్దాలుగా కాంగ్రెస్ జెండా మోసిన పాత నాయకులు, టికెట్లు ఆశించి భంగపడిన స్థానిక నేతలు ఈ గులాబీ వలసదారులను తమ నియోజకవర్గాల్లో కలుపు కెళ్లేందుకు అస్సలు ఇష్టపడడం లేదు.

అందుకే ఈ ఫిరాయింపు ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో ఇమడలేక.. భారత రాష్ట్ర సమితికి ముఖం చూపించలేక తీవ్ర మానసికంగా నలిగిపోతున్నారు. ప్రభుత్వం వద్ద తమ పనులు కాకపోవడం.. అధికారులపై పట్టు తగ్గడంతో సొంత కేడర్ కు కూడా న్యాయం చేయలేకపోతున్నారు.

  • గట్టి న్యాయపోరాటం..

ఫిరాయింపు ఎమ్మెల్యేలపై గులాబీ పార్టీ గట్టిగానే న్యాయపోరాటం చేస్తోంది. ఇటీవల హైకోర్టులో ఇరుపక్షాల వాదనలు పూర్తయ్యాయి. గులాబీ పార్టీ తరఫున బలమైన వాదనలతోపాటు ఆధారాలు చూపించారు న్యాయవాదులు. క్షుణ్ణంగా విచారణ చేపట్టిన హైకోర్టు తీర్పును రిజర్వ్ చేసింది. సెప్టెంబర్ 16న తీర్పు వెల్లడించనుంది.

అయితే కాంగ్రెస్ కార్యక్రమాల్లో పాల్గొన్న ఆధారాలు, సాక్షాలను హైకోర్టుకు అందించడంతో తీర్పు ఎలా ఉంటుందో అన్న ఆందోళన ఫిరాయింపు ఎమ్మెల్యేల్లో కనిపిస్తోంది. ఒకవేళ ప్రతికూల తీర్పు వస్తే మాత్రం ఈ ఎమ్మెల్యేల రాజకీయ భవిష్యత్తు కష్టమే. చూడాలి మరి ఏం జరుగుతుందో.

Anji Peraboina
Anji Peraboinahttp://www.crimemirror.com
పేరబోయిన ఆంజనేయులు ప్రస్తుతం క్రైమ్ మిర్రర్ తెలుగు దినపత్రికలో సీనియర్ డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు. తెలంగాణకు సంబంధించిన తాజా వార్తలు, ప్రభుత్వ పథకాల అప్డేట్లు, మౌలిక సదుపాయాల అభివృద్ధి, రాజకీయ పరిణామాలు మరియు ప్రత్యేక కథనాలను సమగ్రంగా అందిస్తున్నారు. జర్నలిజం రంగంలో 7 సంవత్సరాలకు పైగా అనుభవం కలిగిన ఆయన, గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో రాష్ట్ర వార్తలు మరియు రాజకీయ విశ్లేషణలు రాశారు. క్షేత్రస్థాయిలో రాజకీయ సర్వేల్లో పాల్గొన్న అనుభవంతో పాటు, క్రైమ్ ఇన్వెస్టిగేషన్ మరియు పరిశోధనాత్మక జర్నలిజంలో ప్రత్యేక నైపుణ్యం సంపాదించారు. తెలంగాణ రాజకీయ పరిణామాలపై లోతైన అవగాహనతో పాటు, ప్రజలకు నమ్మకమైన సమాచారం అందించడంలో అంజి కృషి కొనసాగుతోంది. తన ప్రతిభకు గుర్తింపుగా, 2025 ఆగస్టులో ఉత్తమ పనితీరు కోసం జర్నలిస్టు అవార్డు అందుకున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు