Homeక్రైమ్మంగల్‌పురిలో కత్తులతో దాడులు.. ఆరుగురికి గాయాలు

మంగల్‌పురిలో కత్తులతో దాడులు.. ఆరుగురికి గాయాలు

క్రైమ్ మిర్రర్ : ఢిల్లీ శివారు ప్రాంతమైన మంగల్‌పురిలో శుక్రవారం సాయంత్రం వరుస కత్తి దాడులు కలకలం సృష్టించాయి. కొందరు యువకులు కత్తులతో తిరుగుతూ ఎదురుగా కనిపించిన వారిపై దాడులకు పాల్పడినట్లు సమాచారం. ఈ ఘటనల్లో మొత్తం ఆరుగురు గాయపడినట్లు తెలుస్తోంది. మంగల్‌పురిలోని ఎల్‌ బ్లాక్‌ పరిధిలో మూడు లేన్లలో వరుసగా ఇలాంటి దాడులు జరిగినట్లు పోలీసులు ప్రాథమికంగా గుర్తించారు. ఒక్కసారిగా కత్తులతో దాడులు జరగడంతో స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ఘటన అనంతరం గాయపడిన వారిని వెంటనే సంజయ్‌ గాంధీ ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. వీరిలో ఇద్దరి పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని మెరుగైన వైద్యం కోసం సఫ్దర్‌జంగ్‌ ఆస్పత్రికి తరలించినట్లు సమాచారం.

ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు రంగంలోకి దిగారు. దాడులకు పాల్పడిన వ్యక్తులను గుర్తించేందుకు పరిసర ప్రాంతాల్లోని సీసీటీవీ కెమెరాల ఫుటేజీని పరిశీలిస్తున్నారు. ఘటనకు సంబంధించిన వీడియోలు, ప్రత్యక్ష సాక్షుల వివరాలను కూడా సేకరిస్తున్నారు. ప్రాథమిక దర్యాప్తు ప్రకారం పాత కక్షలు, వ్యక్తిగత వివాదాలే ఈ దాడులకు కారణమై ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. దాడుల్లో పాల్గొన్న వారిలో కొందరు బాల నేరస్థులు కూడా ఉన్నట్లు గుర్తించినట్లు సమాచారం. అయితే పూర్తి వివరాలు దర్యాప్తు పూర్తయిన తర్వాతే వెల్లడవుతాయని పోలీసులు చెబుతున్నారు. దాడుల అనంతరం కొందరు వ్యక్తులు స్థానికులను బెదిరించి దోపిడీకి పాల్పడినట్లు కూడా స్థానికులు ఆరోపిస్తున్నారు. వరుస ఘటనలతో మంగల్‌పురి ప్రాంతంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. నిందితులను త్వరగా గుర్తించి అదుపులోకి తీసుకునేందుకు పోలీసులు చర్యలు ముమ్మరం చేశారు.
also read : Breaking News: కొండాపూర్‌లో కుప్పకూలిన 7 అంతస్థుల భవనం..!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు