విశాఖపట్నం నగరంలోని గాజువాక పరిధిలో విషాద ఘటన చోటుచేసుకుంది. చట్టివానిపాలెం ప్రాంతానికి చెందిన 26 ఏళ్ల సాఫ్ట్వేర్ ఉద్యోగి చెట్టి అవినాశ్ తన నివాసంలో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
అవినాశ్ ఇంట్లో ఉరికి వేలాడుతూ కనిపించడంతో కుటుంబ సభ్యులు వెంటనే అతడిని సమీపంలోని క్లినిక్‌కు తరలించారు. అయితే అప్పటికే అవినాశ్ మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించినట్లు సమాచారం.
సమాచారం అందుకున్న గాజువాక పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని వివరాలు సేకరించారు. అనంతరం మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి తరలించారు. ఆత్మహత్య ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
అవినాశ్ ఆత్మహత్యకు గల కారణాలు ఇంకా తెలియరాలేదు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు పోలీసుల దర్యాప్తులో త్వరలో వెల్లడి అయ్యే అవకాశం ఉంది.
also read: మొరాదాబాద్‌లో వింత ప్రేమకథ.. ముగ్గురు పిల్లల తల్లి, ఆరుగురు పిల్లల తండ్రి పెళ్లి
