Homeవైరల్జ్యోతిషుడి సలహాతో తొమ్మిది జంటల పునర్వివాహం.. అన్నవరం ఆలయంలో ఆసక్తికర ఘటన

జ్యోతిషుడి సలహాతో తొమ్మిది జంటల పునర్వివాహం.. అన్నవరం ఆలయంలో ఆసక్తికర ఘటన

కష్టాలు తొలగి కుటుంబ జీవితం సాఫీగా సాగాలన్న ఉద్దేశంతో తొమ్మిది జంటలు పునర్వివాహం చేసుకున్న ఘటన ఆసక్తికరంగా మారింది. ఇప్పటికే వివాహమై, పిల్లలు ఉన్న ఈ జంటలు జ్యోతిషుడి సూచన మేరకు అన్నవరం ఆలయంలో మరోసారి పెళ్లి చేసుకున్నట్లు తెలిపారు.

విశాఖపట్నం జిల్లాకు చెందిన తొమ్మిది జంటలు బుధవారం అన్నవరం ఆలయానికి చేరుకున్నారు. ఆర్థిక ఇబ్బందులు, ఆరోగ్య సమస్యలు తదితర సమస్యల నుంచి ఉపశమనం పొందేందుకు పునర్వివాహం చేసుకోవాలని జ్యోతిషుడు సూచించినట్లు వారు వెల్లడించారు.

భవిష్యత్తు మరింత మెరుగ్గా ఉండాలంటే దంపతులు కలిసి ప్రత్యేక వ్రతం ఆచరించడంతో పాటు మరోసారి వివాహం చేసుకోవాలని జ్యోతిషుడు చెప్పినట్లు ఆయా జంటలు పేర్కొన్నారు. దీంతో కుటుంబ సభ్యుల సమక్షంలో ఆలయంలో సంప్రదాయబద్ధంగా పునర్వివాహ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు సమాచారం.

వివాహమై ఏళ్లు గడవడంతో పాటు కొందరికి పిల్లలు కూడా ఉన్నప్పటికీ.. కుటుంబంలో ఎదురవుతున్న సమస్యలు తొలగిపోవాలనే నమ్మకంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు జంటలు తెలిపారు. ప్రస్తుతం ఈ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

also read: విశాఖలో విషాదం.. ఇంట్లోనే సాఫ్ట్‌వేర్ ఉద్యోగి ఆత్మహత్య

తాజావార్తలు