Homeతెలంగాణతెలంగాణ‌లో బీజేపీకి ఇదే మంచి తరుణం...!

తెలంగాణ‌లో బీజేపీకి ఇదే మంచి తరుణం…!

  • అధికార కాంగ్రెస్ పార్టీలో పెరుగుతున్న విభేదాలు

  • గులాబీ పార్టీ పై సన్నగిల్లుతున్న నమ్మకాలు

  • సద్వినియోగం చేసుకోలేకపోతున్న కాషాయ పార్టీ

  • తెలంగాణలో భారతీయ జనతా పార్టీకి ఇదే మంచి సమయం

 

క్రైమ్ మిర్రర్, తెలంగాణ బ్యూరో : తెలంగాణ రాజకీయాల్లో విచిత్ర పరిస్థితులు నెలకొంటున్నాయి. అధికార కాంగ్రెస్ పార్టీ రోజురోజుకు విభేదాల పర్వంతో వీధిన పడుతోంది. ఈ తరుణంలో ప్రత్యామ్నాయంగా నిలవాల్సిన గులాబీ పార్టీ బలోపేతం కావడం లేదు. భారతీయ జనతా పార్టీ సైతం పుంజుకునే ప్రయత్నం చేయడం లేదు. ప్రస్తుతం తెలంగాణలో పొలిటికల్ గ్యాప్ స్పష్టంగా కనిపిస్తోంది. దానిని భర్తీ చేయాల్సిన అవసరం భారతీయ జనతా పార్టీకి ఉంది. తెలంగాణ తెచ్చిన పార్టీగా గులాబీ పార్టీ రెండుసార్లు అధికారం అందుకుంది. ఇచ్చిన పార్టీగా కాంగ్రెస్ ఒకసారి అధికారంలోకి వచ్చింది. బలమైన మద్దతు దారుగా నిలిచిన బిజెపి మాత్రం ఇంతవరకు అధికారాన్ని అందుకోలేకపోయింది. తాజాగా వచ్చిన చక్కటి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోలేకపోతోంది.

రాజకీయ విచిత్ర పరిస్థితులు…

Also Read: ఖాజాగూడ లోని ప్రభుత్వ భూమిలో అక్రమంగా భారీ కమర్షియల్ నిర్మాణం..!

తెలంగాణ సమాజంలో విచిత్ర పరిస్థితి నెలకొంది. గులాబీ పార్టీ పై ప్రజలకు నమ్మకం సన్నగిల్లింది. అవకాశం ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ సద్వినియోగం చేసుకోలేకపోతోంది. ఇటువంటి ప్రత్యేక పరిస్థితుల్లో తెలంగాణ ప్రజల ఆదరణను దక్కించుకోవాల్సిన బిజెపి వెనుకబడి పోతోంది. సార్వత్రిక ఎన్నికలలో అధికార కాంగ్రెస్ పార్టీకి సమానంగా సీట్లు సాధించిన బిజెపి.. తరువాత సరైన రాజకీయ ప్రదర్శన కనబరచలేకపోతోంది. అప్పట్లో వచ్చిన పొలిటికల్ మైలేజ్ ను క్షేత్రస్థాయిలో బలంగా మార్చుకోలేకపోతోంది. ప్రజా సమస్యలపై కాంగ్రెస్ ప్రభుత్వం పై పోరాటాలు చేయడంలో కూడా బిజెపి వెనుకబాటు కనిపిస్తోంది. కేవలం ప్రెస్మీట్లతోపాటు ట్వీట్లకే పరిమితం అవుతోంది ఆ పార్టీ. దానిని అధిగమిస్తే మాత్రం ఖచ్చితంగా 2028 అసెంబ్లీ ఎన్నికల్లో బలమైన రాజకీయ పార్టీగా బిజెపి అవతరించే అవకాశం ఉంది.

క్షేత్రస్థాయిలో బలం…

Also Read:బాక్సాఫీస్ వద్ద ‘ఇరుముడి’ రికార్డుల మోత.. ఫ్లాపులకు చెక్ పెడుతూ రవితేజ కెరీర్ బెస్ట్ ఓపెనింగ్స్!

భారతీయ జనతా పార్టీకి క్షేత్రస్థాయిలో బలం ఉంది. కానీ నడిపించే నాయకత్వం లేదు. అగ్రనేతల మధ్య సమన్వయం కంటే అంతర్గత విభేదాలు అధికం. ఒక బలమైన నాయకుడిని ముందుకు తెచ్చి నాయకత్వ బాధ్యతలు అప్పగిస్తే తెలంగాణ ప్రజల్లో బిజెపి విశ్వాసం పెంచుకునే అవకాశం ఉంది. కానీ అగ్రనాయకత్వం ఆ పని చేయడం లేదు. దీంతో తెలంగాణలో అధికారంలోకి రావాలనుకున్న బిజెపికి ఇబ్బందికర పరిస్థితులు ఎదురవుతున్నాయి.. అధికార పార్టీపై వ్యతిరేకత ఉంది. ప్రతిపక్ష గులాబీ పార్టీ పై నమ్మకం సన్నగిల్లింది. ఈ సువర్ణ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడంలో మాత్రం బిజెపి విఫలం అయింది అని చెప్పవచ్చు. ఇకనైనా గుణ పాఠాలు నేర్చుకొని భారతీయ జనతా పార్టీ జవసత్వాలతో పోరాడితే కచ్చితంగా విజయం మోకరిల్లాల్సిందే.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు