క్రైమ్ మిర్రర్, ఆంధ్రప్రదేశ్:- భక్తుల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) కీలక నిర్ణయం తీసుకుంది. తిరుమల కొండపై ఉన్న ఫాస్ట్ ఫుడ్ సెంటర్లు, రెస్టారెంట్లు, హోటళ్లలో గోబీ (కాలీఫ్లవర్) వంటకాలను తాత్కాలికంగా నిషేధిస్తున్నట్లు ప్రకటించింది. ఇటీవల కాలీఫ్లవర్‌లో పురుగులు వస్తుండటాన్ని గుర్తించిన నేపథ్యంలో టీటీడీ ఈ చర్య చేపట్టింది.టీటీడీ హెల్త్ డిప్యూటీ ఈవో సోమన్నారాయణ శుక్రవారం తిరుమలలోని హోటళ్లు, రెస్టారెంట్లు, ఫాస్ట్ ఫుడ్ సెంటర్ల నిర్వాహకులతో సమావేశమయ్యారు. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. భక్తుల ఆరోగ్య శ్రేయస్సుకు పెద్దపీట వేయాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు. ఇటీవల మార్కెట్‌లో లభిస్తున్న కాలీఫ్లవర్‌లో పురుగులు ఎక్కువగా కనిపిస్తున్నాయని, ఇవి భక్తుల ఆరోగ్యానికి హాని కలిగించే ప్రమాదం ఉందని వివరించారు. కాబట్టి, భక్తుల ఆరోగ్య రక్షణ కోసం తాత్కాలికంగా గోబీతో చేసే వంటకాలను నిషేధిస్తున్నట్లు వెల్లడించారు.
స్వయంకృషితో శిఖరానికి.. మెగాస్టార్ చిరంజీవికి జన్మదిన శుభాకాంక్షలు!
ఇదివరకే, తిరుమల పవిత్రతను కాపాడటానికి, భక్తులకు స్వచ్ఛమైన, సాంప్రదాయకమైన సాత్విక ఆహారాన్ని అందించే ఉద్దేశ్యంతో టీటీడీ చైనీస్ వంటకాలను (మంచూరియా, ఫ్రైడ్ రైస్, న్యూడిల్స్ వంటివి) ఫాస్ట్ ఫుడ్ సెంటర్లు, రెస్టారెంట్లలో నిషేధించిన సంగతి తెలిసిందే. హోటళ్లు, ఆహార విక్రయ కేంద్రాలు పరిశుభ్రతను పాటించాలని, నాణ్యమైన ఆహారాన్ని మాత్రమే అందించాలని టీటీడీ అధికారులు కఠిన ఆదేశాలు జారీ చేశారు.తాజా నిర్ణయంతో తిరుమలకు వచ్చే భక్తులకు ఇకపై గోబీ మంచూరియా, గోబీ ఫ్రై వంటి వంటకాలు అందుబాటులో ఉండవు. ఆహార పదార్థాల నాణ్యత విషయంలో రాజీ పడేది లేదని, ఎవరైనా నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని టీటీడీ హెచ్చరించింది.
భర్తను కాపాడేందుకు చివరి వరకు పోరాటం.. నటి మీనా ఎమోషనల్ కామెంట్స్!
