Homeతెలంగాణలంచం తీసుకుంటూ అడ్డంగా బుక్కైన పంచాయతీ కార్యదర్శి..

లంచం తీసుకుంటూ అడ్డంగా బుక్కైన పంచాయతీ కార్యదర్శి..

క్రైమ్ మిర్రర్ : ప్రభుత్వ కార్యాలయాల్లో లంచాల వ్యవహారాలపై ఏసీబీ అధికారులు నిఘా పెంచారు. తాజాగా మంచిర్యాల జిల్లాలో లంచం తీసుకుంటున్న పంచాయతీ కార్యదర్శి ఏసీబీ వలకు చిక్కారు. జన్నారం మండలం లింగయ్యపల్లె గ్రామపంచాయతీ కార్యదర్శి వరలక్ష్మి లంచం తీసుకుంటూ అధికారులకు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడ్డారు. పోలీసులు, ఏసీబీ అధికారుల వివరాల ప్రకారం.. ఓ వ్యక్తి ఇంటి నిర్మాణానికి అనుమతి కోసం గ్రామపంచాయతీని ఆశ్రయించాడు. అయితే అనుమతి మంజూరు చేసేందుకు కార్యదర్శి వరలక్ష్మి రూ.11 వేల లంచం డిమాండ్ చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. దీంతో బాధితుడు ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు.

పక్కా ప్లాన్‌తో రంగంలోకి ఏసీబీ

ఫిర్యాదు అందుకున్న ఏసీబీ అధికారులు పక్కా ప్రణాళికతో రంగంలోకి దిగారు. శుక్రవారం జన్నారం మండలంలో దాడి నిర్వహించి.. బాధితుడి నుంచి లంచం తీసుకుంటున్న సమయంలో వరలక్ష్మిని రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఆమె వద్ద నుంచి లంచం మొత్తాన్ని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. అనంతరం కేసు నమోదు చేసి తదుపరి న్యాయపరమైన చర్యలు చేపట్టినట్లు తెలిపారు.

వరుసగా ఏసీబీ వలలో ఉద్యోగులు

రాష్ట్రంలో అవినీతి, లంచాలపై ఏసీబీ అధికారులు ప్రత్యేక దృష్టి సారించారు. ఇటీవల వరుసగా పలువురు ప్రభుత్వ ఉద్యోగులు లంచం తీసుకుంటూ పట్టుబడుతుండటం చర్చనీయాంశంగా మారింది. ప్రజల నుంచి లంచం డిమాండ్ చేసే అధికారులు, సిబ్బందిపై కఠిన చర్యలు తప్పవని ఏసీబీ అధికారులు స్పష్టం చేస్తున్నారు. ప్రభుత్వ కార్యాలయాల్లో ఏదైనా పని కోసం లంచం డిమాండ్ చేస్తే వెంటనే సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేయాలని ప్రజలకు సూచిస్తున్నారు.
also read : టిడిపికి మరో గవర్నర్ పదవి…!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు