Homeక్రైమ్నలుగురు బాలికలపై లైంగిక దాడి కేసులో పాస్ట‌ర్‌కు మరణశిక్ష

నలుగురు బాలికలపై లైంగిక దాడి కేసులో పాస్ట‌ర్‌కు మరణశిక్ష

క్రైమ్ మిర్రర్ : తమిళనాడులో నలుగురు బాలికలపై లైంగిక దాడికి పాల్పడిన కేసులో 47 ఏళ్ల వ్యక్తికి తిరునెల్వేలి పోక్సో కోర్టు కఠిన శిక్ష విధించింది. నిందితుడిని అబ్రహంగా గుర్తించిన కోర్టు.. అతడికి నాలుగు వేర్వేరు మరణశిక్షలు విధించింది. అలాగే రూ.52 వేల జరిమానా చెల్లించాలని ఆదేశించింది. ఈ కేసులో తీర్పును న్యాయమూర్తి సురేశ్ కుమార్ వెలువరించారు. బాధితులైన నలుగురు బాలికలకు ఒక్కొక్కరికి రూ.10 లక్షల చొప్పున పరిహారం అందించాలని కూడా కోర్టు ఆదేశించింది.

2022లో కేసు నమోదు

2022 జూలై 5న తిరునెల్వేలిలోని మహిళా పోలీస్ స్టేషన్‌లో పోక్సో చట్టం కింద కేసు నమోదైంది. ఓ బాలిక తల్లి ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. అనంతరం అబ్రహంను అరెస్ట్ చేసి ఆధారాలను సేకరించారు. చార్జిషీట్‌లో పేర్కొన్న ఆరోపణలు, సాక్ష్యాలు నేరాన్ని నిర్ధారిస్తున్నాయని విచారణ సందర్భంగా కోర్టు నిర్ధారించినట్లు సమాచారం.

చర్చిలో బాలికలను నిర్బంధించి..

తిరునెల్వేలి జిల్లాలోని గంగైకొండ సమీపంలోని మేలైలంతైకులం చర్చికి వెళ్లిన బాలికలను అబ్రహం అక్రమంగా నిర్బంధించి లైంగిక దాడికి పాల్పడినట్లు ప్రాసిక్యూషన్ ఆరోపించింది. విషయం ఎవరికైనా చెబితే తీవ్ర పరిణామాలు ఉంటాయని, చంపేస్తానంటూ బాలికలను నిందితుడు బెదిరించినట్లు ప్రాసిక్యూషన్ కోర్టుకు తెలిపింది. కేసులో సమర్పించిన సాక్ష్యాలను పరిశీలించిన అనంతరం న్యాయస్థానం నిందితుడిని దోషిగా నిర్ధారించి శిక్ష విధించింది.
also read : “ తమ్ముడి పలకరింపు చాలు!”- బ్రహ్మానందం సోదరుడి భావోద్వేగ వ్యాఖ్యలు..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు