Homeఆంధ్ర ప్రదేశ్విశాఖలో విషాదం.. టీచర్ కొట్టడంతో ఆరేళ్ల బాలుడు మృతి?

విశాఖలో విషాదం.. టీచర్ కొట్టడంతో ఆరేళ్ల బాలుడు మృతి?

క్రైమ్ మిర్రర్ : విశాఖపట్నంలో విషాద ఘటన చోటుచేసుకుంది. వన్‌టౌన్ ప్రాంతంలోని లిటిల్ గార్డెన్ స్కూల్‌లో ఆరేళ్ల బాలుడు ప్రణయ్ తేజ్ తరగతి గదిలోనే కుప్పకూలిపోయాడు. అపస్మారక స్థితిలో ఉన్న బాలుడిని వెంటనే ఆస్పత్రికి తరలించగా.. అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు వెల్లడించారు. బాలుడి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కేజీహెచ్‌కు తరలించారు. విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు, బంధువులు పాఠశాలకు చేరుకుని ఆందోళన చేపట్టారు. హోంవర్క్ పూర్తి చేయలేదనే కారణంతో టీచర్ బాలుడిని మందలించడంతో పాటు కొట్టారని, ఆ తర్వాతే అతడు కుప్పకూలాడని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. టీచర్ దాడి కారణంగానే బాలుడు మృతి చెందాడని వారు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అయితే బాలుడి మృతికి అసలు కారణం పోస్టుమార్టం నివేదిక, పోలీసుల దర్యాప్తులో తేలాల్సి ఉంది.

కేజీహెచ్‌లో బాలుడి మృతదేహాన్ని చూసిన తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపించారు. తమ కుమారుడి మృతికి కారణమైన టీచర్‌తో పాటు పాఠశాల యాజమాన్యంపై కఠిన చర్యలు తీసుకోవాలని బంధువులు డిమాండ్ చేస్తున్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. పాఠశాలలో జరిగిన పరిణామాలు, బాలుడి ఆరోగ్య పరిస్థితి, మృతికి గల కారణాలపై పోలీసులు వివరాలు సేకరిస్తున్నారు.
also read : బడంగ్‌పేట్ మున్సిపల్ కార్పొరేషన్ అధికారుల తీరుపై తీవ్ర అసంతృప్తి..!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు