Homeసినిమాప్రభాస్ స్పిరిట్ , ఫౌజీ సినిమాలపై భారీ అప్‌డేట్స్..!

ప్రభాస్ స్పిరిట్ , ఫౌజీ సినిమాలపై భారీ అప్‌డేట్స్..!

క్రైమ్ మిర్రర్, సినిమా:- పాన్‌ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. ఒకవైపు సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో తెరకెక్కుతున్న స్పిరిట్ షూటింగ్ కొనసాగుతుండగా, మరోవైపు హను రాఘవపూడి దర్శకత్వంలో రూపొందుతున్న ఫౌజీ చిత్రీకరణ కూడా శరవేగంగా జరుగుతోంది. ఈ రెండు సినిమాలకు సంబంధించి ప్రస్తుతం ఇండస్ట్రీలో ఆసక్తికరమైన వార్తలు వినిపిస్తున్నాయి.ప్రభాస్ హీరోగా సందీప్ రెడ్డి వంగా తెరకెక్కిస్తున్న స్పిరిట్ పై భారీ అంచనాలు ఉన్నాయి. ఈ సినిమాను వచ్చే ఏడాది మార్చి 5న విడుదల చేయనున్నట్లు గతంలో ప్రకటించారు. ఈ తేదీ ఈద్‌ వీకెండ్‌కు దగ్గరగా ఉండటంతో బాలీవుడ్‌లోనూ సినిమాపై ఆసక్తి పెరిగింది. అయితే ప్రస్తుతం స్పిరిట్ షూటింగ్‌కు సంబంధించిన కొంత భాగం ఇంకా పూర్తి కావాల్సి ఉందని సమాచారం. దాదాపు 75 రోజుల చిత్రీకరణ పెండింగ్‌లో ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. దీంతో ప్రకటించిన సమయానికి సినిమాను పూర్తి చేసి విడుదల చేయడం సాధ్యమవుతుందా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఒకవేళ విడుదల వాయిదా పడితే ప్రభాస్ సినిమాకు మరో తేదీని ఖరారు చేయాల్సి ఉంటుంది. అదే సమయంలో ఈద్ సీజన్‌లో మరో భారీ బాలీవుడ్ సినిమా విడుదలకు సిద్ధమవుతున్న నేపథ్యంలో బాక్సాఫీస్ క్లాష్ కూడా తప్పే అవకాశం ఉంది.

పడుకునే ముందు గ్లాసు ధనియాల నీరు తాగితే ఆరోగ్యానికి మంచిదా?

ఇక హను రాఘవపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఫౌజీ విషయంలో మాత్రం షూటింగ్ వేగంగా కొనసాగుతున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం హైదరాబాద్‌లోని అల్యూమినియం ఫ్యాక్టరీలో ప్రభాస్‌పై కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నట్లు సమాచారం. ప్రభాస్‌కు సంబంధించిన షూటింగ్‌ను సెప్టెంబర్‌లోపు పూర్తి చేయాలని చిత్రబృందం లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలుస్తోంది. సినిమాకు సంబంధించిన పనులను వేగంగా పూర్తి చేసేందుకు ఒకేసారి మూడు యూనిట్లు పనిచేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది.ఫౌజీ డిజిటల్ హక్కులను నెట్‌ఫ్లిక్స్ సొంతం చేసుకున్నట్లు వార్తలు వచ్చాయి. ఈ సినిమా డిసెంబర్ 3న విడుదల కావాలనే లక్ష్యంతో పనులు జరుగుతున్నట్లు సమాచారం. దీంతో షూటింగ్‌తో పాటు పోస్ట్ ప్రొడక్షన్ పనులను కూడా వేగంగా పూర్తి చేయాల్సిన పరిస్థితి ఏర్పడినట్లు తెలుస్తోంది. అయితే డిసెంబర్ 3 విడుదల తేదీపై చిత్రబృందం నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.ఫౌజీ లో ప్రభాస్ సరసన ఇమాన్వి హీరోయిన్‌గా నటిస్తోంది. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్ ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచింది. జంధ్యం ధరించి, యుద్ధభూమి నేపథ్యంలో వీరుడి తరహా లుక్‌లో ప్రభాస్ కనిపించడం ప్రత్యేక ఆకర్షణగా మారింది. ప్రస్తుతం ప్రభాస్ నటిస్తున్న ఈ రెండు సినిమాల్లో ఏది ముందుగా ప్రేక్షకుల ముందుకు వస్తుందనే విషయం ఆసక్తిని పెంచుతోంది. అధికారిక ప్రకటన వచ్చే వరకు విడుదల తేదీలపై వస్తున్న వార్తలను ప్రచారంగానే చూడాల్సి ఉంటుంది.

రూ.1.5 కోట్ల ‘బాస్ స్కామ్’ వెనుక అంతర్జాతీయ సైబర్ ముఠా.. 4,500 సిమ్ కార్డులు స్వాధీనం

Vengal Reddy
Vengal Reddyhttps://crimemirror.com/
2025 నుంచి "క్రైమ్ మిర్రర్" లో సీనియర్ సబ్‌ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. గత 4 ఏళ్లుగా వివిధ దినపత్రికల్లో-వెబ్ సైట్-సోషల్ మీడియా ఆప్స్' లలో కంటెంట్ క్రియేటర్ గా పని చేసిన అనుభవం ఉంది. పాలిటిక్స్‌, టెక్నాలజీ, లైఫ్‌ స్టైల్‌, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు