Homeసినిమాప్రియా భవానీ శంకర్ షాకింగ్ కామెంట్స్..!

ప్రియా భవానీ శంకర్ షాకింగ్ కామెంట్స్..!

క్రైమ్ మిర్రర్, సినిమా:- కోలీవుడ్ హీరోయిన్ ప్రియా భవానీ శంకర్ తాజాగా ప్రేమ, రిలేషన్‌షిప్‌ గురించి చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ప్రస్తుతం హీరో హీరోయిన్ల ప్రేమాయణాలు, బ్రేకప్‌లపై చర్చ జరుగుతున్న నేపథ్యంలో ఆమె చేసిన కామెంట్స్ ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. ముఖ్యంగా రిలేషన్‌షిప్‌లో అసౌకర్యంగా అనిపించినప్పుడు ఎలాంటి నిర్ణయం తీసుకోవాలో ఆమె తన అభిప్రాయాన్ని స్పష్టంగా వెల్లడించారు.చెన్నైకి చెందిన ప్రియా భవానీ శంకర్ తొలుత న్యూస్ రీడర్‌గా, యాంకర్‌గా కెరీర్ ప్రారంభించారు. అనంతరం బుల్లితెర సీరియల్స్, టీవీ షోల్లో కనిపించి గుర్తింపు తెచ్చుకున్నారు. 2017లో మేయధ మాన్ సినిమాతో వెండితెరకు పరిచయమయ్యారు. ఆ తర్వాత కడైకుట్టి సింగమ్, మోన్‌స్టర్, మాఫియా చాప్టర్ 1, యానై, తిరుచిత్రాంబలం, పాతు తల, డిమోంటే కాలనీ 2, బ్లాక్, జీబ్రా వంటి చిత్రాల్లో నటించారు. తెలుగులో కళ్యాణం కమనీయం, భీమ, జీబ్రా వంటి సినిమాల్లోనూ కనిపించారు. ప్రస్తుతం రవితేజతో కలిసి ఇరుముడి సినిమాలో నటించారు. ఈ చిత్రంలో ఆమె భార్యగా, తల్లిగా నటించినట్లు సమాచారం. గ్లామర్ పాత్రలకంటే నటనకు ప్రాధాన్యమున్న పాత్రలను ఎంచుకుంటూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంటున్నారు.

బండి రమేషా.. సత్యం శ్రీరంగమా! కూకట్ పల్లి కాంగ్రెస్ ఇంచార్జ్ ఎవరు?

ప్రియా భవానీ శంకర్ వ్యక్తిగత జీవితానికి వస్తే.. ఆమె రాజ్‌వేల్ రాజ్‌తో చాలాకాలంగా రిలేషన్‌షిప్‌లో ఉన్నారు. కాలేజీ రోజుల నుంచే వీరిద్దరి మధ్య ప్రేమ కొనసాగుతున్నట్లు తెలుస్తోంది. సోషల్ మీడియాలోనూ ప్రియుడితో కలిసి ఉన్న ఫొటోలను ఆమె అప్పుడప్పుడు షేర్ చేస్తుంటారు. అయితే వీరి పెళ్లి ఎప్పుడు అనేది మాత్రం ఇప్పటివరకు స్పష్టత లేదు.ఇటీవల ఓ ఇంటర్వ్యూలో రిలేషన్‌షిప్ గురించి మాట్లాడిన ప్రియా.. అమ్మాయిలకు తమకు ఏం కావాలో ముందుగా స్పష్టమైన క్లారిటీ ఉండాలని చెప్పారు. ప్రేమ విషయంలో అవసరం లేని రాజీలు చేసుకోవాల్సిన అవసరం లేదని ఆమె అభిప్రాయపడ్డారు. ఒకవేళ భాగస్వామి ప్రవర్తన అసౌకర్యంగా అనిపించినా, ఆ రిలేషన్‌షిప్ భారంగా మారినా దానిని కొనసాగించడం కంటే అక్కడితో ముగించి ముందుకు సాగడం మంచిదని తెలిపారు.తన విషయంలోనూ ఇలాంటి పరిస్థితి ఎదురైతే ఇదే నిర్ణయం తీసుకుంటానని ప్రియా భవానీ శంకర్ స్పష్టం చేశారు. ప్రస్తుతం ఆమె చేసిన ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో చర్చకు దారితీశాయి.

తారాపీఠ్‌లో ఘోర అగ్నిప్రమాదం.. ఏడుగురు భక్తులు మృతి

Vengal Reddy
Vengal Reddyhttps://crimemirror.com/
2025 నుంచి "క్రైమ్ మిర్రర్" లో సీనియర్ సబ్‌ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. గత 4 ఏళ్లుగా వివిధ దినపత్రికల్లో-వెబ్ సైట్-సోషల్ మీడియా ఆప్స్' లలో కంటెంట్ క్రియేటర్ గా పని చేసిన అనుభవం ఉంది. పాలిటిక్స్‌, టెక్నాలజీ, లైఫ్‌ స్టైల్‌, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు