Homeఆంధ్ర ప్రదేశ్తెలుగు రాష్ట్రాలపై బీజేపీ ఫోకస్...!

తెలుగు రాష్ట్రాలపై బీజేపీ ఫోకస్…!

  • జాతీయ కార్యవర్గంలో పలువురు నేతలకు చోటు

  • బి ఎల్ సంతోష్ పదవి పదిలం

  • రామ్ మాధవ్, పురందేశ్వరికి కీలక బాధ్యతలు

  • విష్ణువర్ధన్ రెడ్డికి సైతం…

క్రైమ్ మిర్రర్, సెంట్రల్ డెస్క్: భారతీయ జనతా పార్టీ తెలుగు రాష్ట్రాలపై ఫుల్ ఫోకస్ పెట్టింది. రెండు రాష్ట్రాల్లో పార్టీ అభివృద్ధిపై దృష్టి సారించింది. అందులో భాగంగా జాతీయ కార్యవర్గంలో ఉభయ తెలుగు రాష్ట్రాలకు ఎంతో ప్రాధాన్యం ఇచ్చింది. పార్టీ సంస్థాగత వ్యవహారాల్లో అత్యంత కీలకమైన జాతీయ ప్రధాన కార్యదర్శి పదవిలో బి ఎల్ సంతోష్ ను తిరిగి కొనసాగించింది. ఆయనను ఆర్ఎస్ఎస్ కు పంపిస్తారని ప్రచారం జరిగింది. చివరకు పార్టీలో అదే పదవిలో కొనసాగించాలని నిర్ణయించడం విశేషం. ఆర్ఎస్ఎస్ సమన్వయకర్తగా ఆయన అనుభవం, సంస్థాగత పట్టును పరిగణలోకి తీసుకొని ఈ కీలక బాధ్యతలను తిరిగి ఆయనకి కట్టబెట్టింది.

రెండు రాష్ట్రాలకు పెద్దపీట…

Also Read:72 ఏళ్ల వయసులో మనవడితో కలిసి ఎల్‌బ్రస్ శిఖరాన్ని అధిరోహించిన విజయవాడ వాసి

జాతీయస్థాయిలో భారతీయ జనతా పార్టీ నాయకత్వ పునర్వ్యవస్థీకరణ పై దృష్టి పెట్టింది హై కమాండ్. అందులో భాగంగా తెలుగు రాష్ట్రాలకు చెందిన సీనియర్ నేతలకు కీలక హోదాలు దక్కాయి. గతంలో జాతీయ ప్రధాన కార్యదర్శిగా, పార్టీ వ్యూహకర్తగా రాణించిన రామ్ మాధవ్ తో పాటు ఏపీ బీజేపీ మాజీ చీఫ్, ప్రస్తుత రాజమండ్రి ఎంపీ దగ్గుబాటి పురందేశ్వరికి బిజెపి జాతీయ ఉపాధ్యక్షులుగా అత్యున్నత పదవులు లభించాయి. జాతీయస్థాయిలో విధానపరమైన నిర్ణయాల్లో, అంతర్రాష్ట్ర సమన్వయంలో కీలక పాత్ర పోషించే ఈ పదవులను ఇద్దరు తెలుగు నేతలకు అప్పగించడం ద్వారా.. జాతీయస్థాయిలో తెలుగు నాయకత్వ ప్రాధాన్యతకు చాటింది.

అత్యుత్తమ పదవి…

Also Read:బిగ్ బాస్ టైటిల్ గెలిచినా ఆ ఆనందం ఎక్కువ రోజులు నిలవలేదు- పల్లవి ప్రశాంత్

ఇంకోవైపు ఏపీకి చెందిన బిజెపి కీలక నాయకుడు ఎన్ విష్ణువర్ధన్ రెడ్డికి జాతీయస్థాయిలో ప్రాతినిధ్యం లభించింది. నేషనల్ ఆల్ సెల్స్ కోఆర్డినేటర్ గా ఆయనకు కీలక బాధ్యతలు అప్పగించారు. గతంలో రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా, పార్టీ ముఖ్య అధికార ప్రతినిధిగా మీడియాలో తన గళం బలంగా వినిపించేవారు విష్ణువర్ధన్ రెడ్డి. ఆయన పనితీరును మెచ్చి హై కమాండ్ ఈ పదవి ఇచ్చింది. మొన్నటి ఎన్నికల్లో ఆయన పోటీ చేయాలని భావించారు కానీ అవకాశం దక్కలేదు. ఏపీలో కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత నామినేటెడ్ పోస్ట్ వస్తుందని భావించారు. అది కూడా దక్కలేదు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి సానుకూలంగా వ్యవహరిస్తారన్న విమర్శ ఆయనపై ఉంది. కానీ ఇప్పుడు జాతీయస్థాయిలో ఆయన ప్రాధాన్యత పెరిగినట్లు అయింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు