Homeక్రైమ్ప్రియురాలిని చంపి గోనె సంచిలో కుక్కి.. బాలాపూర్‌లో దారుణం

ప్రియురాలిని చంపి గోనె సంచిలో కుక్కి.. బాలాపూర్‌లో దారుణం

క్రైమ్ మిర్రర్ : హైదరాబాద్ బాలాపూర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో యువతి హత్య కలకలం రేపింది. బిస్మిల్లా కాలనీలో 21 ఏళ్ల రెహానా కత్తిపోట్లకు గురై మృతి చెందింది. ప్రాథమిక దర్యాప్తులో ఆమెకు పరిచయం ఉన్న మహ్మద్ సలామ్‌పై పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. బిహార్‌కు చెందిన రెహానా పహాడీషరీఫ్ పరిధిలోని బిస్మిల్లా కాలనీలో నివాసం ఉంటూ ఓ ఫంక్షన్ హాల్‌లో పనిచేస్తోంది. అదే చోట పనిచేస్తున్న సలామ్‌తో ఆమెకు పరిచయం ఏర్పడి, కొంతకాలంగా ఇద్దరి మధ్య ప్రేమ సంబంధం కొనసాగినట్లు పోలీసులు తెలిపారు.

ఇటీవల ఇద్దరి మధ్య విభేదాలు తలెత్తినట్లు తెలుస్తోంది. పెళ్లి చేసుకోవాలని రెహానా కోరడం, ఆమె మరో యువకుడితో సన్నిహితంగా ఉంటోందనే అనుమానం సలామ్‌లో ఏర్పడటంతో ఇద్దరి మధ్య గొడవలు జరిగినట్లు సమాచారం. ఈ క్రమంలో రాత్రి మరోసారి వాగ్వాదం జరగగా.. సలామ్ కత్తితో రెహానాపై దాడి చేసినట్లు పోలీసులు ప్రాథమికంగా గుర్తించారు. తీవ్ర గాయాలతో ఆమె అక్కడికక్కడే మృతి చెందినట్లు తెలుస్తోంది.

హత్య అనంతరం మృతదేహాన్ని గోనె సంచిలో పెట్టి అక్కడి నుంచి తరలించేందుకు ప్రయత్నించినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. స్థానికులకు అనుమానం రావడంతో వారు పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే ఘటనాస్థలికి చేరుకున్న బాలాపూర్ పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం కోసం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు.. సలామ్‌తో పాటు మరో ఇద్దరు అనుమానితులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు సమాచారం. హత్యలో మరెవరైనా పాల్గొన్నారా, మృతదేహాన్ని తరలించేందుకు ఎవరైనా సహకరించారా, ఘటన ముందస్తు ప్రణాళికతో జరిగిందా లేదా గొడవలో క్షణికావేశంలో దాడి జరిగిందా అనే కోణాల్లో దర్యాప్తు కొనసాగుతోంది.
also read : రిటైర్మెంట్ డబ్బుల విషయంలో గొడవ.. రోకలిబండతో భర్తను హత్య చేసిన భార్య

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు