క్రైమ్ మిర్రర్ : డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాకు చెందిన ఏడుగురు మత్స్యకారులు సముద్రంలో గల్లంతయ్యారు. వారి ఆచూకీ కోసం కుటుంబ సభ్యులు అల్లవరం మెరైన్ పోలీసులను ఆశ్రయించారు. ఫిర్యాదు అందుకున్న అధికారులు గాలింపు చర్యలు చేపట్టారు. ఈ నెల 3న అల్లవరం మండలం ఓడలరేవు తీరం నుంచి మత్స్యకారులు చేపల వేట కోసం విశాఖపట్నం వైపు బయలుదేరారు. సముద్రంలోకి వెళ్లిన కొద్దిసేపటికే బోటు నుంచి సిగ్నల్స్ నిలిచిపోయినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. సాధారణంగా పది రోజుల్లో తిరిగి రావాల్సి ఉండగా ఇప్పటివరకు వారు ఇంటికి చేరుకోకపోవడంతో కుటుంబాల్లో ఆందోళన నెలకొంది. గల్లంతైన వారి కోసం సముద్రంలో అధికారులు విస్తృతంగా గాలింపు చేపడుతున్నారు. గల్లంతైన మత్స్యకారుల వివరాలు:
- కోపనాతి రామకృష్ణ వర్మ – కొమరగిరిపట్నం, అల్లవరం మండలం (బోటు యజమాని)
- సంఘాని తాతారావు (58) – బలుసుతిప్ప, కాట్రేనికోన మండలం
- పాలెపు పాపారావు (30) – ఓడలరేవు, అల్లవరం మండలం
- కొల్లాటి శ్రీను (35) – ఓడలరేవు, అల్లవరం మండలం
- ఏసుదాసు (45) – బెండమూర్లంక, అల్లవరం మండలం
- కాటాడి సతీశ్ (38) – పశువుల్లంక, పోలవరం మండలం
- కర్రి రాముడు (35) – కొమరగిరిపట్నం, అల్లవరం మండలం
గల్లంతైన మత్స్యకారుల ఆచూకీ కోసం అధికారుల గాలింపు కొనసాగుతోంది. కుటుంబ సభ్యులు తమ వారి క్షేమ సమాచారం కోసం ఎదురుచూస్తున్నారు.
