క్రైమ్ మిర్రర్, సెంట్రల్ డెస్క్: పశ్చిమ బెంగాల్లో తృణమూల్ కాంగ్రెస్ పార్టీకి వరుసగా షాక్ లు తగులుతున్నాయి. ఆ పార్టీకి చెందిన మాజీ మంత్రి, మాజీ డిప్యూటీ స్పీకర్, ఐదు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన సీనియర్ నేత ఆశీష్ బెనర్జీ ఆత్మహత్య చేసుకున్నారు. బీర్బూమ్ జిల్లా రాంపూర్ హాట్ లోని తన ఇంటి సమీపంలో ఉన్న టీఎంసీ కార్యాలయంలోనే ఉరి పోసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఘటనా స్థలంలో లభ్యమైన ఒక సూసైడ్ నోట్ ఆధారంగా ఆయన మరణానికి వెనుక ఉన్న తీవ్ర మానసిక వేదన, అవినీతి ఆరోపణ కుట్రలు బయటపడ్డాయి. ప్రస్తుతం దేశవ్యాప్తంగా దీనిపైనే చర్చ నడుస్తోంది.
అధికార మార్పిడితో…
Also Read:సాయి తేజ్ vs చిరంజీవి… సంక్రాంతి 2027 బరిలో మెగా ఫ్యామిలీ ఫైట్…?
బెంగాల్లో బిజెపి అధికారంలోకి వచ్చిన తర్వాత జరుగుతున్న పరిణామాలు సంచలనం రేపుతున్నాయి. తృణమూల్ కాంగ్రెస్ పార్టీని టార్గెట్ చేసుకుని జరుగుతున్న అణచివేతలు చర్చకు దారితీస్తున్నాయి. ఒక రాష్ట్రానికి మంత్రిగా పనిచేసిన వ్యక్తి, డిప్యూటీ స్పీకర్ గా పనిచేసిన నేత ఇలా బలవన్మరణానికి పాల్పడడం నిజంగా దురదృష్టకరం. ఘటనా స్థలంలో లభించిన సూసైడ్ లేఖలో సంచలన అంశాలు వెలుగులోకి వచ్చాయి.’ నేను నా జీవితంలో ఎలాంటి అవినీతికి పాల్పడలేదు. అసలు రాజకీయాల్లోకి రావడమే నేను చేసిన అతి పెద్ద పొరపాటు’ అంటూ రాసి ఉంది. గతంలో తారాపీట్- రాంపూర్ హాట్ డెవలప్మెంట్ అథారిటీ వ్యవహారాల్లో ఆయనపై కొందరు కుట్ర పూరితంగా అవినీతి మచ్చ వేసేందుకు.. అవమానించేందుకు ప్రయత్నించారని పేర్కొన్నారు. అధారిటీలో టెండర్లు, చెక్కుల జారీ, ప్లాన్ అనుమతులకు సంబంధించి చాలా రకాల ఆరోపణలు చేశారు. అయితే వీటన్నింటిపై దుష్ప్రచారం చేయడంతో మనస్థాపానికి గురైన ఆశీష్ బెనర్జీ ఆత్మహత్య నిర్ణయానికి వచ్చారు.
సూసైడ్ నోట్లో సంచలనాంశాలు…
Also Read:విరాట్ కోహ్లీకి టాలీవుడ్ హీరోయిన్ మరదలు.. ఇంతకీ ఆ బ్యూటీ ఎవరో తెలుసా…?
రాజకీయ వేధింపులతోనే ఆయన ఈ నిర్ణయానికి వచ్చినట్లు అర్థం అవుతుంది. ఆయన రాసిన లేఖ ప్రకారం పార్టీలో జరిగిన కొన్ని తప్పులను ఆయన అంగీకరించలేకపోయారని.. బహిరంగంగా నిలదీసి నిరసన కూడా వ్యక్తం చేయలేకపోయానని తీవ్ర పశ్చాత్తాపం వ్యక్తం చేశారని అర్థం అవుతుంది. రాజకీయ జీవితం తన ప్రతిష్టను మసకబార్చిందని బాధిస్తూ.. తమ కుటుంబంలో ఎవరు కూడా భవిష్యత్తులో రాజకీయాల్లోకి రాకూడదని… సొంత ఉద్యోగాలు, వ్యాపారాలపైనే దృష్టి పెట్టాలని తన కుటుంబ సభ్యులకు సూచించారు అంటే ఎంతలా రాజకీయాల్లో మనస్థాపానికి గురయ్యారో అర్థం అవుతుంది.
ఐదుసార్లు ఎమ్మెల్యేగా…
Also Read:స్వాతంత్ర్య స్ఫూర్తితో మార్మోగిన మర్రిగూడ మండలం…!
సుదీర్ఘ రాజకీయ నేపథ్యం ఆయన సొంతం. 2001 నుంచి 2026 వరకు రాంపూర్ హాట్ నియోజకవర్గానికి ఐదు సార్లు ప్రాతినిధ్యం వహించారు. బెంగాల్ కు విద్యాశాఖ, వ్యవసాయ శాఖ మంత్రిగా కూడా బాధ్యతలు చేపట్టారు. మొన్నటి వరకు డిప్యూటీ స్పీకర్ గా కూడా సేవలు అందించారు.. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమిపాలయ్యారు. తన ఆత్మ గౌరవాన్ని దెబ్బతీసేలా జరిగిన రాజకీయ కుట్రల వల్లే ఈ తీవ్ర నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. అయితే రాజకీయ వేధింపులు ఏ స్థాయిలో ఉంటాయో ఆశిష్ బెనర్జీ ఆత్మహత్య ఉదంతం తెలియజేస్తోంది.
