HomeUncategorizedతెలంగాణలో బిజెపి ఆకర్ష్...! కాంగ్రెస్ ఎమ్మెల్యేలు మూకుమ్మడిగా భారతీయ జనతా పార్టీలోకి...

తెలంగాణలో బిజెపి ఆకర్ష్…! కాంగ్రెస్ ఎమ్మెల్యేలు మూకుమ్మడిగా భారతీయ జనతా పార్టీలోకి…

  • అధికార పార్టీలో ముదురుతున్న విభేదాలు

  • పునరాలోచనలో ఫిరాయింపు ఎమ్మెల్యేలు

  • వారందరికీ ప్రత్యామ్నాయంగా కాషాయ పార్టీ

క్రైమ్ మిర్రర్, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ తుమ్మితే ఊడిపోతుందా? కేంద్రమంత్రి బండి సంజయ్ కామెంట్స్ వెనుక అసలు మర్మం ఏంటి? ఆయన ఎందుకు అంత మాట అన్నారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు బిజెపి టచ్ లోకి వచ్చారా? వారంతా మూకుమ్మడిగా కాషాయ దళంలో చేరనున్నారా? అందుకే బండి సంజయ్ ఈ కామెంట్స్ చేశారా? అనే బలమైన చర్చ తెలంగాణ పొలిటికల్ సర్కిల్స్ లో నడుస్తోంది.

కట్టుదాటుతున్న క్రమశిక్షణ…

Also Read:రోజ్‌మేరీ ఆయిల్‌తో జుట్టుకే కాదు.. మెదడుకు కూడా ప్రయోజనాలేనా? ఇలా వాడితేనే సేఫ్…!

ఇటీవల కాంగ్రెస్ పార్టీలో ఒక రకమైన క్రమశిక్షణ కట్టు దాటుతోంది. నేతల మధ్య ఎక్కడికక్కడే విభేదాలు వెలుగులోకి వస్తున్నాయి. కొంతమంది మంత్రుల విషయంలో ఎమ్మెల్యేలు విభేదిస్తున్నారు. ఒకరి నియోజకవర్గంలో మరొకరు వేలు పెట్టి ఇబ్బందులు తెచ్చుకుంటున్నారు. ఈ క్రమంలో కొందరు నేతలు హై కమాండ్ కు ఫిర్యాదులు చేస్తున్నారు. ప్రతి జిల్లాలో కాంగ్రెస్ పార్టీలో విభేదాలు పర్వం నడుస్తోంది. మంత్రివర్గ విస్తరణ ఆలస్యం జరుగుతుండడంతో ఎమ్మెల్యేలలో అసహనం పెరుగుతోంది. మరోవైపు విస్తరణలో మంత్రి పదవులు పోతాయని ఊహాగానాలు వస్తున్న వారు మరోవైపు పావులు కదుపుతున్నారు. ఇన్ని పరిణామాల నడుమ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు బిజెపిలోకి వెళ్లేందుకు ప్రయత్నాలు చేస్తున్నారా అని అనుమానాలు కూడా ఉన్నాయి.

వారిలో తీవ్ర అసంతృప్తి…

Also Read:సాయి తేజ్ vs చిరంజీవి… సంక్రాంతి 2027 బరిలో మెగా ఫ్యామిలీ ఫైట్…?

గులాబీ పార్టీ నుంచి ఫిరాయించిన ఎమ్మెల్యేలు సైతం తీవ్ర అసంతృప్తితో రగిలిపోతున్నట్లు ప్రచారం నడుస్తోంది. కాంగ్రెస్ లోకి ఫిరాయించిన పోచారం శ్రీనివాస్ రెడ్డి, దానం నాగేందర్ లాంటివారు బహిరంగంగానే తమ ఆవేదనను వ్యక్తం చేస్తున్నారు. వారంతా యూటర్న్ తీసుకుంటారని ప్రచారం నడుస్తోంది. అయితే ఇక్కడే ఒక పరిణామం గమనించాల్సిన అంశం. గులాబీ పార్టీ బలపడడం లేదు. ఆ పార్టీ పుంజుకునే పరిస్థితి కనిపించడం లేదు. ఈ పరిస్థితుల్లో తిరిగి గులాబీ పార్టీలో చేరడం కంటే.. కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపిలో చేరితే ప్రయోజనం అని ఆలోచన చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే కొంతమంది బిజెపికి టచ్ లోకి వెళ్లినట్లు ప్రచారంలో ఉంది. మొన్న ఆ మధ్యన మాజీ మంత్రి, గులాబీ పార్టీ ఎమ్మెల్యే మల్లారెడ్డి బిజెపి అగ్ర నేతలకు దగ్గరయ్యారు. అందుకే ఎన్నికలు సమీపిస్తున్న కొలది మూకుమ్మడిగా కాంగ్రెస్ ఎమ్మెల్యేలు బిజెపిలో చేరిన ఆశ్చర్య పడాల్సిన పనిలేదు. అందుకే బండి సంజయ్ తుమ్మితే ఊడిపోయే ప్రభుత్వం అంటూ వ్యాఖ్యానించారని విశ్లేషకులు భావిస్తున్నారు. చూడాలి మరి ఏం జరుగుతుందో.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు