-
వచ్చే ఎన్నికల్లో ఎంపీగా బరిలో దింపేందుకు జగన్ నిర్ణయం
-
కర్నూలు కానీ.. నంద్యాల నుంచి కానీ పోటీకి అవకాశం
క్రైమ్ మిర్రర్, ఏపీ బ్యూరో: వైయస్సార్ కాంగ్రెస్ అధినేత జగన్మోహన్ రెడ్డి రాజకీయంగా చాలామందికి అవకాశాలు కల్పించారు. పార్టీ ఏర్పాటు చేసిన నాటి నుంచి చాలామంది నేతలు వైసీపీలో ఎదిగారు. 2019లో అయితే 151 మంది ఎమ్మెల్యేలు, 22 మంది ఎంపీలు, మరో 11 మంది రాజ్యసభ సభ్యులు, 40 మందికి పైగా ఎమ్మెల్సీలు, వందలాదిమందికి నామినేటెడ్ పదవులు లభించాయి. అయితే ఇప్పుడు పార్టీ సంక్లిష్ట పరిస్థితుల్లో ఉండగా.. ఆ నేతలంతా ముఖం చాటేసారు. అందుకే జగన్మోహన్ రెడ్డి ఒక స్ట్రాంగ్ నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. ఇటువంటి కష్టకాలంలో పార్టీకి అండగా నిలిచేవారికి వచ్చే ఎన్నికల్లో ప్రాధాన్యం కల్పించాలని డిసైడ్ అయినట్లు సమాచారం. అందులో భాగంగా యువనేత బైరెడ్డి సిద్ధార్థ రెడ్డికి ఎంపీ టికెట్ ఇచ్చేందుకు సూత్రప్రాయంగా ఒక నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది.
పార్టీ ఆవిర్భావం నుంచి…
Also Read:67 ఏళ్ల సినీ ప్రస్థానంపై కమల్ హాసన్ ఆసక్తికర వ్యాఖ్యలు.. “నేను ఓల్డెస్ట్ జెన్ జెడ్”!
బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో క్రియాశీలకంగా పనిచేస్తున్నారు. ఆ పార్టీ ఆవిర్భావం నుంచి పనిచేస్తూ వచ్చారు. అప్పట్లో బాబాయ్ బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి తో కలిసి వైసీపీలో చేరారు. కానీ బైరెడ్డి శేఖర్ రెడ్డి వైసీపీ నాయకత్వంతో విభేదించి బయటకు వెళ్ళిపోయారు. కానీ సిద్ధార్థ రెడ్డి మాత్రం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగారు. 2019లో నందికొట్కూరు నియోజకవర్గంలో పార్టీ అభ్యర్థి గెలుపులో క్రియాశీలక పాత్ర పోషించారు. దీంతో అధికారంలోకి వచ్చిన జగన్ బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి కి కీలక పదవి ఇచ్చారు. శాప్ చైర్మన్గా అవకాశం కల్పించారు. మొన్నటి ఎన్నికల్లో టికెట్ ఆశించారు సిద్ధార్థ రెడ్డి. కానీ సర్దుబాటు చేయలేకపోయారు జగన్. కానీ ఈసారి అటువంటి పరిస్థితి లేకుండా ఎంపీ టికెట్ ఇచ్చేందుకు డిసైడ్ అయినట్లు తెలుస్తోంది.
మంచి పట్టు ఉన్న ఫ్యామిలీ…
Also Read:30 ఏళ్ల తర్వాత డీఎన్‌ఏ టెస్ట్‌తో బయటపడిన బంధం.. స్నేహితురాలే సొంత సోదరి అని తెలిసి!
కర్నూలు జిల్లా నందికొట్కూరు ప్రాంతంలో బైరెడ్డి కుటుంబానికి మంచి పట్టు ఉంది. బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి తాత, బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి తండ్రి శేషశైనా రెడ్డి తెలుగుదేశం పార్టీలో సుదీర్ఘకాలం పని చేశారు. చాలా పదవులు చేపట్టారు. ఆయన తర్వాత రాజశేఖర్ రెడ్డి సైతం అదే పార్టీలో కొనసాగారు. ఇప్పుడు టిడిపిలో ఉన్నారు రాజశేఖర్ రెడ్డి. ఆయన కుమార్తె బైరెడ్డి శబరి నంద్యాల టిడిపి ఎంపీగా కొనసాగుతున్నారు. ప్రస్తుతం కర్నూలు జిల్లాలో కూటమి స్ట్రాంగ్ గా ఉంది. దానిని ఢీకొట్టే నాయకుడు కనిపించకుండా పోతున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో దూకుడు ప్రదర్శిస్తున్నారు బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి. పార్టీ శ్రేణులకు అండగా నిలుస్తున్నారు. అందుకే వచ్చే ఎన్నికల్లో బైరెడ్డి సిద్ధార్థ రెడ్డికి కర్నూలు ఎంపీగా కానీ.. నంద్యాల ఎంపీగా కానీ.. టిక్కెట్ ఇచ్చి ప్రోత్సహించేందుకు జగన్ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. మరి అందులో ఎంత వాస్తవం ఉందో చూడాలి
