Homeక్రైమ్దారుణం...న‌టి సోద‌రిపై అత్యాచారం, బ్లాక్ మెయిల్...! నిందితుడు అరెస్టు

దారుణం…న‌టి సోద‌రిపై అత్యాచారం, బ్లాక్ మెయిల్…! నిందితుడు అరెస్టు

బెంగళూరు , క్రైమ్‌మిర్ర‌ర్‌: స‌మాజంలో మ‌హిళ‌ల కోసం ఎన్ని చ‌ట్టాలు వ‌చ్చిన వారిపై అఘాయిత్యాలు మాత్రం ఆగ‌డం లేదు. పెళ్లి చేసుకుంటాన‌ని ఓ న‌టి సోద‌రిని న‌మ్మించి లోబ‌ర్చుకొని ఆ త‌రువాత బ్లాక్ మెయిల్ చేసిన ఘ‌ట‌న బెంగుళూరులో చోటు చేసుకుంది.ఒక నటి సోదరిపై అత్యాచారానికి పాల్పడి, ఫొటోలు, వీడియోలతో బెదిరింపులకు పాల్పడుతున్న రాఘవేంద్ర (28) అనే నిందితుడ్ని చంద్రాలేఅవుట్ ఠాణా పోలీసులు గురువారం అరెస్టు చేశారు. నటి సోదరి, రాఘవేంద్ర ఇద్దరూ ఒకే చోట పని చేసేవారు.

Also Read:రెడ్ కార్పెట్‌పై ఊహించని ముద్దు.. నికిత రావల్ షాకింగ్ రియాక్షన్

పరిచయం ప్రేమగా మారింది. తనకు ఇప్పటికే వివాహమైన విషయాన్ని దాచి పెట్టి తనను పెళ్లి చేసుకుంటానని నమ్మించాడు. బలవంతం చేసి శారీరక సంబంధాన్ని పెట్టుకున్నాడు. ఆ సమయంలో తీసుకున్న ఫొటోలు, వీడియోలు అడ్డుపెట్టుకుని నగదు గుంజడం మొదలుపెట్టాడు. బాధితురాలి ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. నటి, ఆమె సోదరి ఇద్దరూ తన తల్లికి ఫోన్ చేసి బెదిరిస్తున్నారంటూ వారిద్దరిపై తలఘట్టపుర ఠాణాలో రాఘవేంద్ర ఫిర్యాదు చేశాడు.

Also Read:రూ.271 కోట్ల పెంట్‌హౌస్‌.. దేశ రియల్ ఎస్టేట్‌లో సంచలనం!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు