చాలామంది కొత్తలో ఎంతో ఉత్సాహంగా వర్కౌట్స్
మొదలుపెడతారు. హెవీ వర్కౌట్స్ చేస్తూ జిమ్‌లో చెమటోడ్చుతారు. కానీ ఆ ఉత్సాహం కొన్నాళ్లకే ఆవిరైపోతుంది. కొద్ది రోజులకే బోర్ కొడుతోందనో, లేక బద్ధకించో మొత్తానికే వ్యాయామానికి స్వస్తి చెబుతుంటారు. కానీ ఫిట్‌నెస్ సాధించాలంటే కన్సిస్టెన్సీ (నిలకడ) ఉండటం చాలా ముఖ్యం.ఆరోగ్యంగా ఉండాలంటే వ్యాయామాన్ని మన దినచర్యలో తప్పనిసరి చేసుకోవాలి. దాన్ని ఒక అలవాటుగా మార్చుకోవాలి. ఒకేసారి గంటల తరబడి కాకుండా, మొదట 10 నిమిషాలతో ప్రారంభించి, క్రమంగా సమయాన్ని పెంచుకుంటూ పోవాలి. ఇలా చేయడం వల్ల శరీరానికి వ్యాయామం అలవాటు పడుతుంది.అలాగే, అలసటగా అనిపించిన రోజుల్లో వ్యాయామాన్ని పూర్తిగా మానేయకూడదు. అలాంటి రోజుల్లో కఠినమైన వర్కౌట్స్ కు బదులుగా, తేలికపాటి వ్యాయామాలు చేయాలి. వాకింగ్ చేయడం, స్ట్రెచింగ్ చేయడం లాంటివి చేయవచ్చు. దీనివల్ల కండరాలకు సాంత్వన కలుగుతుంది.రోజూ ఒకే రకమైన వర్కౌట్స్ చేయడం వల్ల కూడా బోర్ కొట్టే అవకాశం ఉంది. అలాంటప్పుడు రెగ్యులర్ వర్కౌట్స్ స్థానంలో కొత్త తరహా వ్యాయామాలు ప్రయత్నించాలి. స్విమ్మింగ్, బ్రిస్క్ వాక్, ఏరోబిక్స్, జుంబా లేదా డ్యాన్స్ లాంటివి చేయవచ్చు. ఇవి వ్యాయామాన్ని ఆసక్తికరంగా మార్చడమే కాకుండా, ఫిట్‌నెస్‌ను కాపాడుకోవడానికి కూడా సహాయపడతాయి. ముఖ్యంగా, వ్యాయామాన్ని ఆస్వాదిస్తూ చేస్తే అది ఒక భారంగా అనిపించదు.
గాలేలో అగ్నిపరీక్ష: వాతావరణం, కూకాబుర్ర బంతే భారత్‌కు అసలు సవాల్!
తెలంగాణలో రానున్న రెండు రోజులు వానలే వానలు!
