Homeజాతీయంటాటా సన్స్ చైర్మన్ పదవికి చంద్రశేఖరన్ రాజీనామా.. తదుపరి అధిపతి ఎవరనే ఉత్కంఠ

టాటా సన్స్ చైర్మన్ పదవికి చంద్రశేఖరన్ రాజీనామా.. తదుపరి అధిపతి ఎవరనే ఉత్కంఠ

టాటా గ్రూప్‌లో కీలక పరిణామం చోటుచేసుకుంది. టాటా సన్స్ చైర్మన్ ఎన్. చంద్రశేఖరన్ తన పదవికి రాజీనామా చేసినట్లు సమాచారం. ఆయన ప్రస్తుత పదవీకాలం 2027 ఫిబ్రవరి వరకు ఉన్నప్పటికీ, ఈ నెల 18న జరగనున్న టాటా గ్రూప్ జనరల్ బాడీ సమావేశానికి ముందే ఈ నిర్ణయం తీసుకోవడం ప్రాధాన్యం సంతరించుకుంది.

చంద్రశేఖరన్ 2017లో టాటా సన్స్ చైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించారు. ఆయన నేతృత్వంలో టాటా గ్రూప్‌లోని పలు వ్యాపార విభాగాలు విస్తరణ దిశగా అడుగులు వేశాయి. ఇప్పుడు ఆయన రాజీనామా నేపథ్యంలో గ్రూప్ తదుపరి నాయకత్వంపై ఆసక్తి నెలకొంది.

చంద్రశేఖరన్ నిర్ణయం వెలువడిన తర్వాత మార్కెట్‌లోనూ ప్రభావం కనిపించినట్లు సమాచారం. టాటా గ్రూప్‌కు చెందిన పలు లిస్టెడ్ కంపెనీల షేర్లలో ఒడిదుడుకులు చోటుచేసుకున్నాయి. ముఖ్యంగా పెట్టుబడిదారులు తదుపరి నాయకత్వంపై స్పష్టత కోసం ఎదురుచూస్తున్నారు.

ఈ నెల 18న జరిగే జనరల్ బాడీ సమావేశం నేపథ్యంలో కొత్త నాయకత్వానికి సంబంధించి కీలక నిర్ణయాలు వెలువడే అవకాశం ఉందనే చర్చ జరుగుతోంది. అయితే తదుపరి చైర్మన్ ఎవరనేది అధికారికంగా స్పష్టత రావాల్సి ఉంది.

also read: దాదర్ స్టార్ మాల్‌లో స్పా ముసుగులో వ్యభిచార దందా.. ఆరుగురు యువతులు అదుపులోకి

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు