Homeతెలంగాణహైదరాబాద్‌లో నకిలీ నంబర్ ప్లేట్లపై కఠిన చర్యలు.. ఇప్పటికే పలువురిపై క్రిమినల్ కేసులు నమోదు

హైదరాబాద్‌లో నకిలీ నంబర్ ప్లేట్లపై కఠిన చర్యలు.. ఇప్పటికే పలువురిపై క్రిమినల్ కేసులు నమోదు

హైదరాబాద్ నగరంలో నకిలీ, ట్యాంపర్ చేసిన నంబర్ ప్లేట్లపై ట్రాఫిక్ పోలీసులు కఠినంగా వ్యవహరిస్తున్నారు. ఇటీవల నిర్వహించిన ప్రత్యేక తనిఖీలలో ఇలాంటి ఉల్లంఘనలకు పాల్పడిన వాహనదారులపై చర్యలు తీసుకున్నట్లు అధికారులు వెల్లడించారు.

ట్రాఫిక్ చలానాలను తప్పించుకునేందుకు కొంతమంది వాహనదారులు ఫేక్ నంబర్ ప్లేట్లను ఉపయోగిస్తున్నట్లు గుర్తించిన పోలీసులు, అలాంటి చర్యలను సహించబోమని స్పష్టం చేశారు. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై ఇప్పటికే పలువురిపై క్రిమినల్ కేసులు నమోదు చేసినట్లు తెలిపారు.

పంజాగుట్ట, చిలకలగూడ, దిండి, కంచన్‌బాగ్, చాంద్రాయణగుట్ట/బాండ్లగూడ ప్రాంతాల్లో ఈ కేసులు నమోదయ్యాయి. నిబంధనలు పాటించని వాహనాలను సీజ్ చేసి, చట్టపరమైన చర్యలు తీసుకుంటున్నట్లు అధికారులు పేర్కొన్నారు.
ప్రభుత్వం ఆమోదించిన హై సెక్యూరిటీ రిజిస్ట్రేషన్ ప్లేట్స్ (HSRP) మాత్రమే వాహనాలపై ఉండాలని ట్రాఫిక్ పోలీసులు సూచించారు. నంబర్ ప్లేట్లలో మార్పులు చేయడం, నకిలీ ప్లేట్లు వాడటం వంటి చర్యలపై ‘జీరో టాలరెన్స్’ విధానం అమల్లో ఉందని స్పష్టం చేశారు.

వాహనదారులు ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని, చట్టవిరుద్ధ చర్యలకు దూరంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు. లేనిపక్షంలో కఠినమైన చట్టపరమైన చర్యలు తప్పవని తెలియజేశారు.

also read: సోషల్ మీడియాలో వలపువల… యువకుల నుంచి కోట్లు దోచుకున్న మహిళ గుట్టు రట్టు

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు