వాయువ్య బంగాళాఖాతంలో రాబోయే 24 గంటల్లో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ (APSDMA) హెచ్చరించింది. ఈ అల్పపీడన ప్రభావంతో రానున్న రెండు రోజుల పాటు ఏపీలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.ముఖ్యంగా శ్రీకాకుళం, మన్యం, విశాఖపట్నం, విజయనగరం జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని పేర్కొంది. కోస్తాంధ్రలో ఉరుములు, మెరుపులతో కూడిన మోస్తరు వర్షాలు పడొచ్చని అధికారులు వెల్లడించారు. ఈ నేపథ్యంలో లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని సూచించారు.ఇక తెలంగాణలో కూడా రేపు ఉదయం 10:30 గంటలలోపు ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఈ రెండు రాష్ట్రాల ప్రజలు వాతావరణ శాఖ సూచనలను ఎప్పటికప్పుడు గమనిస్తూ తగిన జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు.
Health Tips: అన్నం గంజి నీళ్లు పారబోస్తున్నారా? పెద్దలు తాగిన ఈ నీళ్లు లో దాగిన ఆరోగ్య రహస్యాలు ఇవే!
జీడిపప్పు తింటే శరీరంలో ఏం జరుగుతుంది..?
