Homeతెలంగాణమృతదేహం తరలింపుపై అంబులెన్స్ సిబ్బంది దౌర్జన్యం.. మంచిర్యాలలో వివాదం

మృతదేహం తరలింపుపై అంబులెన్స్ సిబ్బంది దౌర్జన్యం.. మంచిర్యాలలో వివాదం

సున్నితమైన సమయంలో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తుండగా అంబులెన్స్ సిబ్బంది వ్యవహరించిన తీరు తీవ్ర వివాదానికి దారితీసింది. మృతదేహాన్ని ఇంటికి తీసుకెళ్తున్న సమయంలో మధ్యలో అడ్డగించి, తమ అంబులెన్స్‌లోనే తరలించాలని పట్టుబట్టడం స్థానికంగా చర్చనీయాంశమైంది.

మంచిర్యాల పట్టణంలో జరిగిన ఈ ఘటన బాధిత కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో వెలుగులోకి వచ్చింది. వివరాల ప్రకారం, పట్టణంలోని ఒక అపార్ట్‌మెంట్‌లో నివసిస్తున్న 65 ఏళ్ల వృద్ధుడు అకస్మాత్తుగా అనారోగ్యానికి గురయ్యారు. కుటుంబ సభ్యులు వెంటనే ఆయనను స్థానికంగా అందుబాటులో ఉన్న అంబులెన్స్‌లో ఆస్పత్రికి తరలించారు. అయితే, వైద్యులు ఆయన అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు.

తర్వాత శవపరీక్షలు పూర్తయ్యాక మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు. దీంతో వారు మరో అంబులెన్స్‌లో ఇంటికి తీసుకెళ్తుండగా, ఆస్పత్రి వద్ద ఉన్న కొందరు అంబులెన్స్ సిబ్బంది ఆ వాహనాన్ని అడ్డుకున్నట్లు ఆరోపణలు ఉన్నాయి.

“మా అంబులెన్స్‌లోనే మృతదేహాన్ని తీసుకెళ్లాలి” అంటూ వాగ్వాదానికి దిగిన సిబ్బంది, ఇప్పటికే బయలుదేరిన వాహనాన్ని తిరిగి ఆస్పత్రికి రప్పించారని కుటుంబ సభ్యులు తెలిపారు. అనంతరం తమ అంబులెన్స్‌లోనే తరలింపునకు ఒత్తిడి తీసుకొచ్చినట్లు ఆరోపించారు.

ఇంకా, “ఇక్కడ అంబులెన్స్ పాయింట్ మా నియంత్రణలో ఉంది.. మేమే ముందుగా ఉంటాం.. ఇక్కడ మా మాటే చివరి మాట” అంటూ బెదిరింపులకు పాల్పడ్డారని బాధితులు పేర్కొన్నారు. ఈ ఘటనతో కుటుంబ సభ్యులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఈ వ్యవహారంపై పూర్తి స్థాయి విచారణ జరిపి, బాధ్యులపై చర్యలు తీసుకోవాలని బాధితులు కోరుతున్నారు. ఘటనపై స్థానికంగా ఆగ్రహం వ్యక్తమవుతోంది.

also read: గుజరాత్‌లో అరెస్ట్ అయిన గుంటూరు మాజీ ఎమ్మెల్యే ముస్తఫా.. కిడ్నాప్ కేసులో కీలక మలుపు

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు