తమిళనాడు రాజకీయాల్లో మరోసారి ఉద్రిక్తత నెలకొంది. ప్రముఖ రాజకీయ నాయకుడు, డీఎంకే పార్టీ నేత ఉదయనిధి స్టాలిన్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ఘటన ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారింది. ప్రముఖ నటి త్రిషను లక్ష్యంగా చేసుకుని చేసిన వ్యాఖ్యలు వివాదానికి దారితీయడంతో ఈ పరిణామం చోటుచేసుకుంది.
సమాచారం ప్రకారం, తంజావూర్‌లో నిర్వహించిన ఒక నిరసన కార్యక్రమంలో మాట్లాడిన సందర్భంగా ఉదయనిధి స్టాలిన్ సీఎం విజయ్ గురించి కొన్ని వ్యాఖ్యలు చేశారు. ఆ సమయంలో అక్కడ ఉన్న కార్యకర్తలు త్రిష పేరును నినాదం చేయగా, ఆయన చేసిన వ్యాఖ్యలు అనుచితంగా ఉన్నాయని ఆరోపణలు వెల్లువెత్తాయి.
ఈ వ్యాఖ్యలపై మహిళా విభాగం నాయకులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదును పరిశీలించిన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఈ నేపథ్యంలో ప్రత్యేక బృందం చెన్నైకు వెళ్లి, నీలాంగరైలోని ఆయన నివాసం వద్ద ఉదయనిధిని అదుపులోకి తీసుకుంది.
అనంతరం ఆయనను తంజావూర్‌కు తరలిస్తున్నట్లు సమాచారం. ఈ ఘటనతో రాష్ట్ర రాజకీయాల్లో చర్చలు మరింత వేడెక్కాయి. ఒకవైపు అధికార పార్టీ, మరోవైపు ప్రతిపక్షం మధ్య విమర్శలు తీవ్రంగా మారుతున్నాయి.
ఈ ఘటనపై వివిధ రాజకీయ నాయకులు, సామాజిక వర్గాలు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నాయి. మహిళల గౌరవాన్ని కాపాడాలనే అంశం మరోసారి చర్చకు రావడంతో ఈ కేసు మరింత ప్రాధాన్యం సంతరించుకుంది. పోలీసులు ఈ వ్యవహారంపై పూర్తి వివరాలు సేకరిస్తూ, చట్టపరమైన చర్యలు కొనసాగిస్తున్నారు.
also read: అనాథను అని చెప్పి పెళ్లి… ఫోన్‌లో బయటపడ్డ అసలు నిజాలు
