క్రైమ్ మిర్రర్,అమరావతి:- రాష్ట్రంలో ఎల్ నినో ప్రభావంతో తలెత్తే వర్షాభావ పరిస్థితులను సమర్థవంతంగా ఎదుర్కోవడానికి అధికారులు సన్నద్ధంగా ఉండాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశించారు. రాష్ట్రంలో తాగునీటి సమస్య, పశుగ్రాసం కొరత తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని ఆయన స్పష్టం చేశారు.ఈరోజు సచివాలయంలో సంబంధిత శాఖల అధికారులతో ఆయన సమీక్షా సమావేశం నిర్వహించారు. కమాండ్ కంట్రోల్ రూమ్ ద్వారా పరిస్థితిని పర్యవేక్షించిన సీఎం చంద్రబాబు, అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు. ముఖ్యంగా ఎల్ నినో కారణంగా వర్షపాతం తగ్గే అవకాశం ఉన్నందున, ఏ పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని ఆయన ఉద్ఘాటించారు.
సమావేశంలో సీఎం చంద్రబాబు మాట్లాడిన ముఖ్యాంశాలు:-
తాగునీటికి అత్యధిక ప్రాధాన్యం:-రాష్ట్రవ్యాప్తంగా, ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలకు తాగునీటి ఎద్దడి లేకుండా చూడాలి. నీటి నిల్వలను ఎప్పటికప్పుడు అంచనా వేసి అవసరమైన చోట ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలి. మున్సిపాలిటీలు, గ్రామీణ ప్రాంతాల్లో సరఫరా అవుతున్న తాగునీటి నాణ్యతను నిరంతరం పర్యవేక్షించాలి. తరచుగా ల్యాబ్ టెస్టులు నిర్వహించి, ఆ నివేదికలను పారదర్శకంగా విడుదల చేయాలి. కలుషిత నీటి వల్ల ప్రజలు రోగాల బారిన పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలి.
పరగడుపున ఈ ఆకులు తింటే షుగర్, బీపీ అన్ని నియంత్రణలో..!
పశుగ్రాసం కొరత లేకుండా చర్యలు:- వర్షాభావం వల్ల పశుగ్రాసానికి కొరత ఏర్పడే ప్రమాదం ఉంది. కాబట్టి ముందుగానే అప్రమత్తమై పశుగ్రాసం నిల్వలను పెంచేందుకు చర్యలు తీసుకోవాలి. పాడి రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలి.
అంగన్‌వాడీలపై నిరంతర నిఘా:- రాష్ట్రంలోని అంగన్‌వాడీ కేంద్రాలను అధికారులు నిత్యం తనిఖీ చేయాలి. పిల్లలకు అందించే పౌష్టికాహారం నాణ్యతను పరిశీలించాలి. కేంద్రాల్లో పిల్లలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా తగిన చర్యలు తీసుకోవాలని సీఎం చంద్రబాబు అధికారులకు సూచించారు.ఈ సమీక్షా సమావేశంలో ప్రభుత్వ ఉన్నతాధికారులు, వివిధ శాఖల కార్యదర్శులు పాల్గొన్నారు. ఎల్ నినో పరిస్థితిని ఎదుర్కోవడానికి ప్రభుత్వం తీసుకుంటున్న ముందస్తు చర్యలు సత్ఫలితాలను ఇస్తాయని, ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అధికారులు ఈ సందర్భంగా తెలిపారు.
అక్రమ సంబంధం కోసం భర్త, అత్తను విషం పెట్టి చంపాలని చూసిన మహిళ
