Homeజాతీయంకోర్టు షాక్‌తో బీజేపీ నేత ప్రాణేష్ రాజీనామా.. ఎమ్మెల్సీగా గాయత్రి శాంతేగౌడకు అవకాశం

కోర్టు షాక్‌తో బీజేపీ నేత ప్రాణేష్ రాజీనామా.. ఎమ్మెల్సీగా గాయత్రి శాంతేగౌడకు అవకాశం

కర్ణాటక రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. భారతీయ జనతా పార్టీ (బీజేపీ)కు చెందిన ఎమ్మెల్సీ, విధాన పరిషత్ వైస్-ఛైర్మన్ ఎం.కె. ప్రాణేష్ తన పదవులకు రాజీనామా చేశారు. కోర్టుల్లో వరుసగా ఎదురుదెబ్బలు తగలడంతో ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు.

2021లో జరిగిన చిక్కమగళూరు స్థానిక సంస్థల నియోజకవర్గ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రాణేష్ స్వల్ప మెజారిటీతో విజయం సాధించినట్లు ప్రకటించారు. అయితే ఆ ఎన్నికల ఫలితంపై కాంగ్రెస్ అభ్యర్థి గాయత్రి శాంతేగౌడ అభ్యంతరం వ్యక్తం చేశారు. స్థానిక సంస్థల్లో నామినేట్ అయిన సభ్యులకు ఓటు హక్కు లేదని, వారి ఓట్లను లెక్కించడం చట్ట విరుద్ధమని ఆమె కోర్టును ఆశ్రయించారు.

ఈ కేసును విచారించిన కర్ణాటక హైకోర్టు గాయత్రి వాదనను సమర్థించింది. నామినేటెడ్ సభ్యుల ఓట్లను పక్కనపెట్టి మిగతా ఓట్లను తిరిగి లెక్కించాలని ఆదేశించింది. రీకౌంటింగ్ అనంతరం ఫలితం పూర్తిగా మారింది. గాయత్రి శాంతేగౌడకు ఎక్కువ ఓట్లు లభించగా, ప్రాణేష్ ఓటమి పాలయ్యారు. దీంతో గాయత్రినే విజేతగా కోర్టు ప్రకటించింది.

హైకోర్టు తీర్పును సవాలు చేస్తూ ప్రాణేష్ సుప్రీంకోర్టును ఆశ్రయించినప్పటికీ, అక్కడ కూడా ఆయనకు ఊరట దక్కలేదు. అత్యున్నత న్యాయస్థానం కూడా అప్పీల్‌ను తిరస్కరించడంతో, న్యాయపరంగా అవకాశాలు ముగిశాయి.

ఈ పరిణామాల నేపథ్యంలో ప్రాణేష్ తన ఎమ్మెల్సీ పదవితో పాటు వైస్-ఛైర్మన్ బాధ్యతల నుంచి తప్పుకున్నారు. విధాన పరిషత్ ఛైర్మన్‌కు రాజీనామా లేఖ సమర్పించారు. వ్యక్తిగత కారణాలు, పార్టీ పనులపై దృష్టి సారించాలనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన వెల్లడించారు.

ఇక మిగిలిన కాలానికి గాయత్రి శాంతేగౌడ ఎమ్మెల్సీగా బాధ్యతలు స్వీకరించనున్నారు. ఈ ఘటన కర్ణాటక రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది.

also read: కేవలం 45 నిమిషాల్లో 5 ప్లేట్ల బిర్యానీ..! జీవితాంతం ఫ్రీ బిర్యానీ గెలిచిన యువకుడు

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు