Homeసినిమారెండో పెళ్లిపై క్లారిటీ ఇచ్చిన సురేఖావాణి.. నా జీవితం నా ఇష్టం అంటూ వ్యాఖ్యలు

రెండో పెళ్లిపై క్లారిటీ ఇచ్చిన సురేఖావాణి.. నా జీవితం నా ఇష్టం అంటూ వ్యాఖ్యలు

టాలీవుడ్‌లో తన ప్రత్యేక నటనతో మంచి గుర్తింపు తెచ్చుకున్న క్యారెక్టర్ ఆర్టిస్ట్ సురేఖావాణి.. ప్రస్తుతం తెలుగు సినిమాలతో పాటు ఇతర భాషా చిత్రాలపై కూడా దృష్టి పెడుతున్నారు. తాజాగా ఆమె నటిస్తున్న తమిళ క్రైమ్ థ్రిల్లర్ మూవీ ‘నిరమ్’ ప్రమోషన్స్‌లో పాల్గొన్న సందర్భంగా తన వ్యక్తిగత జీవితంపై వస్తున్న వార్తలపై స్పందించారు.

చాలా కాలంగా సురేఖావాణి వ్యక్తిగత జీవితానికి సంబంధించి సోషల్ మీడియాలో పలు రకాల ప్రచారాలు జరుగుతున్నాయి. ముఖ్యంగా ఆమె రెండో పెళ్లి చేసుకోబోతున్నారనే వార్తలు తరచూ వైరల్ అవుతున్నాయి. ఈ విషయంపై తాజాగా స్పందించిన ఆమె.. తనకు ప్రస్తుతం అలాంటి ఆలోచన ఏమీ లేదని స్పష్టం చేశారు.

“నా జీవితంలో పెళ్లి అనేది ఇప్పటికే ఒకసారి జరిగింది. ఇప్పుడు నా కూతురి జీవితంపై దృష్టి పెట్టాల్సిన సమయం ఇది. ఈ దశలో మళ్లీ పెళ్లి గురించి ఆలోచన లేదు” అంటూ ఆమె తన అభిప్రాయాన్ని వెల్లడించారు. తన పెళ్లిపై గతంలో కూడా సోషల్ మీడియాలో అనేక ఊహాగానాలు వచ్చాయని, వాటిని తాను పెద్దగా పట్టించుకోనని తెలిపారు.

ఇక తన సోషల్ మీడియా పోస్టులపై వచ్చే విమర్శల గురించి కూడా సురేఖావాణి స్పందించారు. తనకు నచ్చిన విధంగా తాను ఫొటోలు, పోస్టులు షేర్ చేస్తానని.. తన జీవితం గురించి నిర్ణయాలు తీసుకునే హక్కు తనకే ఉందని పేర్కొన్నారు.

ఇతరులు ఏమనుకుంటారో అనే విషయాన్ని పట్టించుకోవడం చాలా కాలం క్రితమే మానేశానని ఆమె తెలిపారు. తన ఆనందం, తన కుటుంబం తనకు ముఖ్యమని చెప్పుకొచ్చారు.

కాగా, దర్శకుడు కృష్ణ బలరామ్ తెరకెక్కిస్తున్న ‘నిరమ్’ సినిమాలో సురేఖావాణి కీలక పాత్రలో కనిపించనున్నారు. తాన్యా హోప్, ప్రీతి అస్రాని, నితిన్ సత్య తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి డి. ఇమ్మాన్ సంగీతం అందిస్తున్నారు.

also read: శ్రీకాకుళం ఎస్సై ఘటనపై చింతాడ రవి వీడియో.. ‘దాడి చేయలేదు’ అంటూ వివరణ.. 21 మందిపై కేసులు

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు