Homeక్రైమ్యాదాద్రి భువనగిరిలో దారుణం.. బాలికపై యువకుడి లైంగిక దాడి, కేసు నమోదు

యాదాద్రి భువనగిరిలో దారుణం.. బాలికపై యువకుడి లైంగిక దాడి, కేసు నమోదు

యాదాద్రి భువనగిరి జిల్లాలో బాలికపై లైంగిక దాడి జరిగిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. అడ్డగూడూరు పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన చోటుచేసుకుంది.

పోలీసుల వివరాల ప్రకారం.. ఎలిజాల ఉమేష్ అనే యువకుడు బాలికపై బలవంతంగా లైంగిక దాడికి పాల్పడ్డాడని ఆరోపణలు వచ్చాయి. అనంతరం బాలికను చింతలగడ్డ ప్రాంతంలో వదిలిపెట్టినట్లు సమాచారం.

బాలికను గుర్తించిన బంధువులు కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. ఆ తర్వాత బాధితురాలు పోలీసులను ఆశ్రయించి తనపై యువకుడు బలవంతంగా అత్యాచారం చేశాడని ఫిర్యాదు చేసింది.

ఈ నెల 28న ఈ ఘటన జరిగినప్పటికీ ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బాధితురాలి ఫిర్యాదు ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలను పోలీసులు సేకరిస్తున్నారు.

also read: ఢిల్లీ అల్లర్ల కేసులో తాహిర్ హుస్సేన్‌కు జీవిత ఖైదు.. ఐబీ అధికారి అంకిత్ శర్మ హత్య కేసులో కోర్టు తీర్పు

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు